ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిప్ రెండో సీజన్ ఫైనల్ మ్యాచ్ తేదీ ఖరారైంది. జూన్ 7-11 వరకు ఈ టెస్టు మ్యాచ్ జరుగుతుందని అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించింది. అలాగే ఈ తుదిపోరుకు ఇంగ్లాండ్‌లోని ఓవల్ ఆతిథ్యమివ్వనుందని తెలిపింది. జూన్ 12ను రిజర్వ్ డేగా ప్రకటించారు. ఏదైనా కారణాల వల్ల పూర్తి ఐదు రోజులు జరగకపోతే ఈ రిజర్వ్ డేలో ఆడిస్తారు. మొదటి సీజన్ ఫైనల్లో టీమిండియాను ఓడించిన న్యూజిలాండ్ విజేతగా అవతరించిన విషయం తెలిసిందే. సౌథాంప్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
Also Read: Dinesh Karthik: ‘ఆ పోస్ట్‌ను డిలీట్ చేయ్’..నెటిజన్‌పై కార్తీక్ సీరియస్ అయ్యాడా?
ప్రతి టెస్టు ఛాంపియన్ షిప్ సీజన్ రెండేళ్ల పాటు కొనసాగుతుంది. ఇందులో టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. రెండో సీజన్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఆస్ట్రేలియా 75.56% పాయింట్ల అగ్రస్థానంలో ఉంది. ఇండియా (58.93%) రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్టు సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు గెలిస్తే టీమిండియా ఫైనల్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది. ఈ రెండు జట్లతో పాటు మరో నాలుగు జట్లు ఫైనల్ బెర్తుపై కన్నేశాయి. మూడో ప్లేస్‌లో ఉన్న శ్రీలంక (53.33%), నాలుగో స్థానంలోని సౌతాఫ్రికా(48.72%), ఐదు, ఆరు ర్యాంకింగ్స్‌లో నిలిచిన న్యూజిలాండ్, వెస్టిండీస్‌కు ఫైనల్ చేరే అవకాశం ఉంది. ఇందులో న్యూజిలాండ్ గడ్డపై శ్రీలంక రెండు టెస్టులు ఆడాల్సి ఉండగా.. సౌతాఫ్రికాలో వెస్టిండీస్ రెండు మ్యాచ్‌లు ఆడాలి.
Also Read: AK 62: ఆయన ఏం చేసినా సెన్సేషన్ అవుతోంది…