Dinesh Karthik: ‘ఆ పోస్ట్‌ను డిలీట్ చేయ్’..నెటిజన్‌పై కార్తీక్ సీరియస్ అయ్యాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ ఉండే క్రికెటర్లలో దినేశ్ కార్తీక్ ఒకడు. ముఖ్యంగా గతేడాది ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో కీలక ప్లేయర్‌గా నిలిచాడు. ఫినిషర్‌గా పేరు తెచ్చుకుని టీమిండియాకు రీఎంట్రీ ఇచ్చాడు. టీ20 వరల్డ్ కప్ జట్టులోను ప్లేస్ దక్కించుకున్నాడు. కానీ అక్కడ కొన్ని మ్యాచ్‌లే ఆడినా తర్వాత మళ్లీ జట్టులో ప్లేస్ కోల్పోయాడు. ఈ క్రమంలోనే తాజాగా ట్విట్టర్‌లో తన అభిమానుల కోసం ఓ చాట్ సెషన్ ఏర్పాటు చేశాడు. ఇందులో భాగంగా ఫ్యాన్స్ అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాడీ వెటరన్ వికెట్ కీపర్. అయితే ఈ సమయంలో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు డీకే సమాధానం చెప్పలేకపోయాడు. ఆ ఫ్యాన్ చేసిన ట్వీట్‌ను వెంటనే డిలీట్ చేయాలని కోరాడు. అయితే ఇదంతా చాలా ఫన్నీ మూడ్‌లో జరిగినట్లు తెలుస్తోంది.
Also Read: INDvsAUS Test: నాగ్‌పూర్ పిచ్ ఫోటోలు వైరల్..లెఫ్ట్యాండ్ బ్యాటర్లకు కష్టమే!
Also Read
- Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ఇంతకీ ఏమైందంటే.. తనను అభిమానులు ఏమైనా అడగాలని అనుకుంటే వెంటనే అడగాలని డీకే చెప్పాడు. దీంతో చాలా మంది క్రికెట్ గురించి అతని విశ్లేషణలను అడిగాడు. వీరిలో ఒక అభిమాని మాత్రం డీకేను అవమానినంచాడు. 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో న్యూజిల్యాండ్‌పై టీమిండియా ఓడిపోయింది. డీకే కూడా ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో చాలా ఇబ్బందిపడ్డాడు. ఈ క్రమంలో మొత్తం 24 బంతులు ఎదుర్కొన్న డీకే కేవలం 6 పరుగులు మాత్రమే చేశాడు. మామూలు మ్యాచుల్లో ఇలాంటి ఇన్నింగ్స్ ఆడితే ఏదో క్షమించేయొచ్చు కానీ.. వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో ఇంత ఘోరంగా ఆడటం ఎలా సాధ్యమైందని సదరు అభిమాని అడిగాడు. ఈ విషయంపై ఏమైనా మాట్లాడాలని చెప్పాడు. అయితే ఇది చూసిన డీకే.. దీన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు. ‘ముందు దీన్ని డిలీట్ చెయ్’ అంటూ సరదాగా రియాక్ట్ అయ్యాడు. ప్రస్తుతం ఈ రెండు ట్వీట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Delete this right now 🤦🏻♂️ https://t.co/lKsFtS7YUS
— DK (@DineshKarthik) February 7, 2023
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!