Oval Test: ఓవల్ టెస్ట్ విజయం.. భారత్ సరికొత్త రికార్డ్!
- ఐదవ టెస్ట్‌లో 6 పరుగుల తేడాతో విజయం
- భారత్ సరికొత్త రికార్డ్
- అతి తక్కువ పరుగుల తేడాతో విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Narrowest Wins in Test Cricket: భారత్ సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. టెస్ట్ ఫార్మాట్లో అతి తక్కువ పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓవల్‌లో ఇంగ్లండ్‌తో ముగిసిన ఐదవ టెస్ట్‌లో 6 పరుగుల తేడాతో గెలుపొందడంతో భారత్ ఈ ఫీట్ సాధించింది. 2004లో వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పటివరకు భారత్ లోయెస్ట్ మార్జిన్ విజయం ఇదే. ఓవల్ టెస్ట్‌లో 6 పరుగుల తేడాతో విజయం సాధించడంతో 21 ఏళ్ల రికార్డ్‌ను టీమిండియా తిరిగరాసింది.
1972లో ఇంగ్లండ్‌తో కోల్‌కతాలో జరిగిన టెస్ట్‌లో భారత్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2018లో ఆస్ట్రేలియాపై అడిలైడ్ మైదానంలో 31 రన్స్ తేడాతో గెలుపొందింది. తాజాగా టెస్ట్‌లో 6 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుని చరిత్ర సృష్టించింది. మరోవైపు ఇంగ్లండ్‌కు ఇది నాలుగో లోయెస్ట్ మార్జిన్ ఓటమి. అంతకుముందు న్యూజిలాండ్ (1 రన్, వెల్లింగ్టన్-2023), ఆస్ట్రేలియా (3 రన్స్, మాంచెస్టర్-1902), ఆస్ట్రేలియా (6 రన్స్, సిడ్నీ-1885)పై తక్కువ పరుగుల తేడాతో ఓడింది.
Also Read
- Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
- September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
- 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
- Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
Also Read: Horoscope Today: మంగళవారం దినఫలాలు.. ఆర్ధిక లావాదేవీల విషయాల్లో జాగ్రత్త!
ఓవల్‌లో ఐదు రోజుల పాటు ఆసక్తికరంగా సాగిన పోరులో భారత్ చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. గొప్పగా పోరాడిన భారత్ 6 పరుగుల స్వల్ప తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. 374 పరుగుల లక్ష్య ఛేదనలో 367 పరుగులకు ఇంగ్లీష్ టీమ్ ఆలౌటైంది. మహమ్మద్ సిరాజ్ (5/104), ప్రసిద్ధ్ కృష్ణ (4/126) భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 224 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ 247 రన్స్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 396 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 367 రన్స్ చేసింది. ఈ విజయంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసింది.
తాజావార్తలు
-
Yash Toxic: యష్‌కు బిగ్ షాక్.. ‘టాక్సిక్’ తగ్గితేనే బెటర్!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
Producer Deepti: హీరోయిన్‌పై నిర్మాత సంచలన ఆరోపణలు.. ‘పేమెంట్ ఇవ్వను.. ఆ డబ్బు హార్ట్ ఆపరేషన్లకు విరాళంగా ఇస్తా’
-
King 100 : సంక్రాంతి కంటే ముందే విడుదలకి రెడీ అవుతున్న ‘కింగ్ 100’
ట్రెండింగ్
-
10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?