Site icon NTV Telugu

MEGA CLASS : మన శంకర వరప్రసాద్ సెకండ్ సింగిల్ ‘శశిరేఖ’ వచ్చేసింది..

Msg

Msg

అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా  తెరకెక్కుతున్న సినిమా మన శంకర వరప్రసాద్ గారు. నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి  నుండి వస్తున్నా ఈ సినిమాపై ఇప్పటి నుండే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను భారీ చిత్రాల నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమా నుండి ఇప్పటికే వచ్చిన ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల సెన్సేషన్ హిట్ గా నిలిచింది. 75 మిళియన్స్ కు పైగా వ్యూస్ తో దూసుకెళ్తోంది మీసాల పిల్ల. కాగా ఇప్పడు ఈ సినిమా సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేశారు. శశిరేఖ అని వచ్చిన ఈ సాంగ్ ను సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో, ఫోక్ సింగర్  మధు ప్రియా ఆలపించారు. కాసేపటి క్రితం రిలీజ్ అయిన ఏ సాంగ్ లో చిరు వింటేజ్ లో లుక్ తో పాటు తనదైన స్టెప్స్ అదరగొట్టారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో నటించనున్నారు. ఇటీవల వెంకీ – చిరుపై ఓ మాస్ సాంగ్ ను కూడా షూట్ చేశారు అనిల్ రావిపూడి. మీసాల పిల్ల మాదిరి శశిరేఖ ఎలాంటి సౌండ్ చేస్తుందో ఎంతటి హిట్ అవుతుందో చూడాలి.

Exit mobile version