Aha Naa Pellanta : టీవీలోకి వచ్చేస్తున్న ఓటీటీ సూపర్ హిట్ కామెడీ సిరీస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజ్ తరుణ్ హీరో గా నటించిన జీ 5 ఒరిజినల్ వెబ్ సిరీస్ అహ నా పెళ్లంట. ఓటీటీ జీ5 వేదికగా వీక్షకులను ఆకట్టుకున్న ఈ సూపర్ హిట్ కామెడీ వెబ్ సిరీస్ అహ నా పెళ్లంట బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు జీ సినిమాలు వేదికగా ప్రసారం కానుంది.ఈ మొత్తం సీజన్‌ని ఒక సినిమాగా అందించనుంది. జీ5లో అత్యధికంగా వీక్షించిన తెలుగు సిరీస్ గా అహ నా పెళ్లంట ఫిబ్రవరి 29 గురువారం మధ్యాహ్నం 12 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది.ఓ మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన కథను ఓ పెద్ద ట్విస్ట్‌తో చెప్పే కథే అహ నా పెళ్లంట. ఈ సిరీస్ కథ మొత్తం శీను (రాజ్ తరుణ్) చుట్టూ తిరుగుతుంది. స్కూల్లో జరిగిన సంఘటనతో జీవితంలో ఏ అమ్మాయిని చూడనని తండ్రికి మాటిస్తాడు శీను.కానీ, అనుకోకుండా మహా (శివానీ రాజశేఖర్) శీను జీవితంలోకి వస్తుంది. తర్వాత ఊహంచని ట్విస్ట్‌తో కథ మలుపు తిరుగుతుంది. అసలు శీను స్కూల్లో జరిగిన సంఘటన ఏంటి.. మహా, శీను జీవితాన్ని మారుస్తుందా..వీటికి సమాధానాలు తెలియాలంటే జీ సినిమాలులో సినిమాగా ప్రసారం కానున్న అహ నా పెళ్లంట సిరీస్ చూడాల్సిందే. ఓటీటీలో సబ్‌స్క్రిప్షన్ వల్ల చూడలేకపోయిన వారు బుల్లితెరపై ఎంచక్కా ఈ సిరీస్‌ను సినిమాగా చూసి ఎంజాయ్ చేయొచ్చు.
జీ5 ఒరిజినల్ వెబ్ సిరీస్ అహ నా పెళ్లంటలో హీరో రాజ్ తరుణ్ తల్లిగా ప్రముఖ నటి ఆమని ముఖ్య పాత్ర పోషించింది. అలాగే నటుడు హర్షవర్ధన్ తండ్రి పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. భావోద్వేగాల మేళవింపు గా రూపొందిన ఈ కామెడీ సిరీస్‌కు సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అహ నా పెళ్లంట ఈ గురువారం మీ ముందుకు రాబోతుంది, తప్పక చూడండి అంటూ జీ తెలుగు తాజాగా ప్రకటించింది.ఇదిలా ఉంటే షార్ట్స్ ఫిల్మ్స్ ద్వారా పాపులర్ అయిన రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. ఆ మూవీలో చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో రాజ్ తరుణ్ హీరోగా మంచి గుర్తింపు పొందాడు.తర్వాత సినిమా చూపిస్తా మావ,కుమారి 21 ఎఫ్ మూవీస్‌తో మంచి హిట్స్ అందుకున్నాడు.ఇటీవల నాగార్జున నటించి సూపర్ హిట్ కొట్టిన నా సామిరంగ సినిమాలో రాజ్ తరుణ్ కీలక పాత్ర పోషించాడు. ఇక జీవిత, రాజశేఖర్ దంపతుల కూతురిగా శివాని రాజశేఖర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ఇటీవల కోటబొమ్మాళీ పీఎస్ సినిమాతో ఈ భామ అద్భుత విజయం అందుకుంది.
Also Read
- Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
- Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
- Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
తాజావార్తలు
-
Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
-
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
-
Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
-
Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!