Site icon NTV Telugu

Mechanic Rocky : ఓటీటీ పార్టనర్ ని లాక్ చేసుకున్న “మెకానిక్ రాకీ”

Mechanic Rocky Trailer (1)

Mechanic Rocky Trailer (1)

Mechanic Rocky : ఇటీవల కాలంలో వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు విశ్వక్ సేన్. మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ మెకానిక్ రాకీతో నేడు థియేటర్లలోకి వచ్చాడు. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. రామ్ తాళ్లూరి తన బ్యానర్ ఎస్ ఆర్టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మించారు. విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ మధ్య ట్రయాంగిల్ లవ్ నేపథ్యంలో వస్తున్న మెకానిక్ రాఖీ రిలీజ్ అయి అద్భుతమైన స్పందన అందుకుంది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ అందుకుని విశ్వక్ ఖాతాలో మరో హిట్ చిత్రంగా నిలుస్తుందని ఆయన అభిమానులు అంటున్నారు.

Read Also:Bhupalpally: హనుమాన్ విగ్రహానికి మంటలు.. స్థానికుల్లో ఆందోళన‌..

హీరో మెకానిక్ షాప్ స్థలం కోసం.. అతని తండ్రి విలన్ ను వేధించడం.. తర్వాత ఆ షెడ్డుని కూల్చివేయడం.. దాని కోసం హీరో విలన్ సునీల్ తో ఎలా ఫైట్ చేశాడన్న పాయింట్ ను టచ్ చేస్తూ కథ సాగుతుంది. విశ్వక్ సేన్ మార్క్ మాస్ డైలాగ్స్ ఇందులో ఉన్నాయి. ‘షేప్ అవుట్ చేసుడే కాదు.. షేప్ సెట్ చేసుడు కూడా తెలుసు’ ‘బూట్ కాలితో తంతే ఉత్త కాలు బయటకు వచ్చేస్తది’ వంటి డైలాగ్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. విలన్ గా సునీల్ లుక్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. మొత్తానికి ఈ సినిమాతో విశ్వక్ తన ఖాతాలో మరో హిట్ వేసుకున్నట్లు తెలుస్తోంది. మరి డీసెంట్ బజ్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం పైడ్ ప్రీమియర్స్ తోనే మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ ఓటీటీ రిలీజ్ పార్టనర్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. మరి థియేటర్స్ లో రన్ తర్వాత ఈ సాలిడ్ మాస్ డ్రామా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ కి రానుంది. ప్రైమ్ వీడియో ఈ సినిమాని సొంతం చేసుకున్నారని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి జేక్స్ బిజొయ్ సంగీతం అందించారు.

Read Also:India-Canada Row: వెనక్కి తగ్గిన కెనడా.. మేం అసలు మోడీ, జైశంకర్‌ పేర్లను చెప్పలేదని వెల్లడి

Exit mobile version