OTT Movies: మూవీ లవర్స్‌కు పండగే.. ఓటీటీలోకి వచ్చేసిన రెండు హిట్ సినిమాలు!
- మూవీ లవర్స్‌కు పండగ
- ఓటీటీలోకి వచ్చేసిన దేవర
- అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోన్న వేట్టయన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుత రోజుల్లో వీకెండ్ వచ్చిందంటే చాలు.. మూవీ లవర్స్ ఓటీటీల వైపు చూస్తున్నారు. కొత్త సినిమాలు, సరికొత్త వెబ్ సిరీస్‌లను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా మూవీస్, వెబ్ సిరీస్‌లను తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ వీకెండ్‌కు సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. నేడు రెండు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం ‘దేవర-పార్ట్ 1’. సెప్టెంబర్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. సముద్రం బ్యాప్‌డ్రాప్‌లో వచ్చిన దేవర.. బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. రాత్రి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో రికార్డులు నెలకొల్పిన దేవర.. ఓటీటీలో కూడా కొత్త రికార్డ్స్ సృష్టించడం ఖాయం.
Also Read
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్‌పై ఆగ్రహం..
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘వేట్టయన్’. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్నో అంచనాల నడుమ అక్టోబర్ 10న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. ఈ మూవీ కూడా ఓటీటీలోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. రెండు హిట్ సినిమాలు స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి వచ్చాయని తెలిసి.. మూవీ లవర్స్ పండగ చేసుకుంటున్నారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్‌పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!