Off The Record: జీహెచ్‌ఎంసీలో ముద్ర కోసం ప్రభుత్వ ప్రయత్నాలు.. కార్పొరేషన్స్ ఎన్నికలపై దృష్టి.!

Otr

Otr

Off The Record: అధికార పార్టీ అంటే దూకుడు మీద ఉండాలి..! ప్రభుత్వం ఏ చిన్న పని చేసినా….దాన్ని గొప్పగా చెప్పుకుంటూ… ఊరు వాడ దండోరా వేసినంత పని చేయాలి. బలం లేదనుకున్న చోట… పెంచుకోవాలి. కానీ తెలంగాణ కాంగ్రెస్ ఏం చేస్తోంది? అందులోనూ ఆయువుపట్టు లాంటి రాజధానిలో అసలు ఉనికి చాటుకోగలుగుతోందా? ఎందుకా వెనుకబాటు? ఎక్కడ తేడా కొడుతోంది?

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో అభివృద్ధి పనుల్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. చకచకా టార్గెట్‌ పూర్తిచేసి తమ ముద్ర వేయాలనుకుంటున్నా… అధికార పార్టీగా లోకల్‌ కాంగ్రెస్‌ నేతలు అందుకు సిద్ధంగా ఉన్నారా అన్న సందేహాలు మాత్రం వివిధ వర్గాల్లో పెరుగుతున్నాయి. అభివృద్ధి నమూనా… పరిపాలనా పరమైన అధికారిక వికేంద్రీకరణ ఉండాలన్న ఉద్దేశ్యంతో జీహెచ్‌ఎంసీని మూడు భాగాలుగా విభజించింది సర్కార్‌. మూడు మున్సిపల్‌ కార్పొరేషన్స్‌కు ఎన్నికలు నిర్వహించేందుకు కూడా సిద్ధమవుతోంది.

SIR ప్రక్రియ ముగిసిన వెంటనే.. ఆ పనిలో పడాల్సి ఉంటుంది. ఇదంతా… ప్రభుత్వ పెద్దల ప్లానింగ్‌. కానీ.. క్షేత్ర స్థాయిలో అధికార పార్టీ లీడర్స్‌, కేడర్‌ ఆ ప్లానింగ్‌ను అందిపుచ్చుకుని పాగా వేసేందుకు సిద్ధమవుతున్నారా అంటే… ఠక్కున ఎస్‌ అని చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం సిటీ కాంగ్రెస్‌ నేతలంతా నత్తలతో పోటీ పడుతున్నారట. పేరుకు గ్రేటర్‌ పరిధిలో మూడు జిల్లాలు.. ముగ్గురు అధ్యక్షులను నియమించారుగానీ… ఆశించిన స్థాయిలో పార్టీని బలోపేతం చేసే పని మాత్రం జరగడంలేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. డీసీసీ అధ్యక్షుల్ని అయితే నియమించారుగానీ…. పూర్తి స్థాయిలో కమిటీలను వేసుకోలేదు. పార్టీ ఇచ్చే కార్యాచరణ తప్పితే… బలోపేతం కోసం కొత్తగా చేసే కార్యక్రమాలు కనిపించడం లేదంటున్నారు. అసలా విషయం మీద ఫోకస్‌ ఉండటం లేదని కాంగ్రెస్‌ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. ఇన్ఛార్జ్‌ కార్యదర్శి సచిన్ సావంత్… గాంధీ భవన్‌లో సమీక్షలు చేయడం తప్ప… క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతోందన్న సంగతి పట్టించుకోవడం మర్చిపోయినట్టు ఉన్నారన్న మాటలు వినిపిస్తున్నాయి.

గతంలో హైదరాబాద్ కాంగ్రెస్‌ అంటే… Pjr, ముఖేష్ గౌడ్ లాంటి టీం ఉండేది. ఆ తర్వాత దానం నాగేందర్‌ హల్చల్ చేశారు. కానీ ఇప్పుడు అంత బలమైన నాయకత్వం కనిపించడం లేదన్న హస్తం టాక్‌. 2023 ఎన్నికల్లో జిల్లాల్లో పార్టీ హవా కనిపించించిందిగానీ…. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మాత్రం వెనుకబడిందన్నది విస్తృతాభిప్రాయం. అలాంటి చోట ప్రత్యేకంగా ఫోకస్‌ చేయాల్సిందిపోయి… అసలు యాక్టివిటీనే కనిపించకపోతే ఎలాగన్నది సగటు కార్యకర్త ప్రశ్న. రాజకీయ ఎత్తుగడలుండే ఏ పార్టీ అయినా… చేయాల్సింది ఇదే. కానీ కాంగ్రెస్‌ నాయకత్వం మాత్రం నియోజక వర్గాల వారీగా దృష్టి పెట్టిన దాఖలు లేవు. ఐతే ఇదే సమయంలో ఎంఐఎంతో దోస్తీ కూడా ఇందుకు ఒక కారణం అయి ఉండవచ్చని అంటున్నారు. ఆ ఫ్రెండ్‌షిప్‌ కారణంగా… సిటీ పరిధిలో మంత్రులు కూడా తమ సొంత పార్టీ నేతలను కాదని… పొరుగు నాయకుల్ని ప్రోత్సహిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. దీంతో సొంత పార్టీ నేతలు డీలా పడుతున్నారట. ఇప్పటికైనా పార్టీ కమిటీలు వేయడం… క్యాడర్ పెంచుకోవడం…ప్రభుత్వ పథకాల్ని పేదల వరకు తీసుకెళ్ళడం లాంటి పనులు చేస్తే పార్టీకి అదనపు బలం తోడవుతుందని, కానీ నాయకత్వం దీనిపై పెద్దగా ఫోకస్ చేసినట్టు కనిపించడం లేదని అంటున్నారు సిటీ కాంగ్రెస్‌ లీడర్స్‌.

ఎంపీ వర్సెస్‌ మాజీ ఎమ్మెల్యే…. మధ్యలో ఎమ్మెల్యే. ఆ నియోజకవర్గంలో అలా ట్రయాంగిల్‌ వార్‌ నడుస్తోదా? సొంత పార్టీ ఎంపీనే మాజీ ఎమ్మెల్యే ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు? ముగ్గురూ కలిసి కాంగ్రెస్‌ కేడర్‌కు ఎందుకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు? మాజీ ఎమ్మెలే అసలు టార్గెట్ మరొకరైతే… ఆయన మాత్రం ఎంపీ లక్ష్యంగా చేసుకున్నారన్నది నిజమేనా? ఎక్కడ జరుగుతోందా వ్యవహారం? ఎవరా ముగ్గురు?