Off The Record : ఉమ్మడి కడప జిల్లా టీడీపీ నేతల్లో ఆందోళన పెరుగుతుందా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి కడప జిల్లా టీడీపీ నేతలు ఎక్కువ మందిలో ఆందోళన పెరుగుతోందా? బాబు ష్యూరిటీ, భవిష్యత్‌కు గ్యారంటీ అని ప్రచారం చేద్దామంటే… తమ భవిష్యత్కే గ్యారంటీ లేకుండా పోతోందని కంగారు పడుతున్నారా? ఇక్కడి నేతలు ఏం కోరుకుంటున్నారు? పార్టీ పెద్దలు ఏం చేస్తున్నారు? కొందరు కన్నీళ్ళు పెట్టుకుంటుంటే మరి కొందరు పక్క పార్టీల వైపు ఎందుకు చూస్తున్నారు? కడప టీడీపీలో కలకలం రేగుతోందట. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో రకం సమస్యతో సతమతం అవుతున్నారు నేతలు. ఇన్నాళ్ళు నానా కష్టాలు పడి కాపు కాస్తే… ఇప్పుడొచ్చి ఎవరో టిక్కెట్‌ని తన్నుకుపోతున్నారని ఆవేదనగా ఉన్నారట చాలా మంది నేతలు. కన్నీళ్ళు పెట్టుకుంటున్న వాళ్ళు సైతం ఉన్నారు. ప్రొద్దుటూరు టిడిపి ఇన్చార్జ్ ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డికి మొండిచేయి చూపింది అధిష్టానం. సర్వేల పేరుతో ఇక్కడ మాజీ ఎమ్మెల్యే వరదరాజు రెడ్డికి టిక్కెట్ దక్కింది. కష్టకాలంలో అండగా ఉన్న తనను కాదని… వరదరాజులురెడ్డికి ఎలా ఇస్తారంటూ కన్నీటి పర్యంతం అయ్యారట ప్రవీణ్. కన్నతల్లి లాంటి పార్టీ మోసం చేసిందని, అమ్మను చెప్పుతో ఎలా కొట్టగలనంటూ కేడర్ దగ్గర ఘాటుగానే రియాక్ట్ అవుతున్నట్టు తెలిసింది. కోవర్టులకు టికెట్లు ఇస్తున్నారని కూడా ఆరోపణల వర్షం కురిపించారాయన. అటు జమ్మలమడుగు నియోజకవర్గ పరిస్థితి మరోలా ఉంది. ఇక్కడ టిడిపికి నేతలే కరవైన పరిస్థితుల్లో అండగా నిలిచారు దేవగుడి భూపేష్ రెడ్డి. ప్రాజెక్టుల సందర్శన పేరుతో కడప జిల్లాకు వచ్చిన చంద్రబాబు నాయుడు నాటి బహిరంగ సభలో ఎమ్మెల్యే అభ్యర్థి భూపేష్ రెడ్డి అని ప్రకటించారు. నాటి నుంచి నేటి వరకు బాబు ష్యురిటీ, భవిష్యత్‌కు గ్యారెంటీ అంటూ ప్రజలకు వెళ్లారాయన.
అయితే నేడు తన భవిష్యత్తుకే గ్యారెంటీ లేకుండాపోయిందని వాపోతున్నారట భూపేష్. జమ్మలమడుగు స్థానాన్ని పొత్తులో భాగంగా బిజెపికి కేటాయించారు. దీంతో భూపేష్ రెడ్డి పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. ఇక రాయచోటిలో ఇంకో స్టోరీ. పదేళ్ల నుంచి ఇక్కడ ఇన్చార్జిగా కొనసాగుతూ వచ్చిన రమేష్ రెడ్డికి ఈసారి టిక్కెట్ గ్యారంటీ లేకుండా పోయింది. ఆయనను కాదని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి టికెట్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. దీంతో పార్టీ శ్రేణులు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పార్టీ పోస్టర్లను తగులు పెట్టారు కార్యకర్తలు. ఇక టిడిపిలో ఇమడలేక భవిష్యత్ గ్యారెంటీ కోసం రమేష్‌రెడ్డి వైసిపి వైపు చూస్తున్నట్టు సమాచారం. అటు రాజంపేటలో అంతకంటే గొప్పగా ఏమీలేదట. ఇప్పటివరకు టిడిపి ఇన్చార్జిగా కొనసాగుతూ వచ్చిన బత్యాల చెంగల్ రాయుడు పేరును గత రెండు లిస్ట్‌ల్లో కూడా ప్రకటించలేదు. దీంతో చెంగల్రాయుడుకు టికెట్ ఇవ్వాలంటూ రోడ్డెక్కారు తెలుగు తమ్ముళ్ళు. ఆయన్ని కాదని బయట వ్యక్తికి ఇస్తే సహకరించే ప్రసక్తే లేదని కూడా కుండబద్దలు కొట్టేస్తున్నారట. ఇక వర్గ విభేదాల సంగతి చెప్పనక్కర్లేదు. ఇలా…టికెట్ల వ్యవహారం ఉమ్మడి కడప జిల్లాలో టిడిపికి తలనొప్పిగా మారిందట. ప్రతి సీటు ప్రతిష్టాత్మకంగా మారిన పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం ఈ వ్యవహారాన్ని ఎలా సెట్ చేస్తుందన్నది ఆసక్తిగా మారింది.
Also Read
- Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
- AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
- boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
- Tags
- Kadapa
- ntv
- off the record
- tdp
తాజావార్తలు
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
-
Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!