Site icon NTV Telugu

Osman Sagar, Himayat Sagar: ఫుల్ ట్యాంక్ లెవెల్ కి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలు..

Himayath Sagar

Himayath Sagar

భారీగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలకు వరద కొనసాగుతోంది. వరద తాకిడికి ఫుల్ ట్యాంక్ లెవెల్ కి చేరాయి. ఉస్మాన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్1790 అడుగులు కాగా.. 1789.25 అడుగులకు చేరిన నీటిమట్టం.. హిమాయత్ సార్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 1763.50 కాగా.. ప్రస్తుతం 1762.80 అడుగులకు చేరిన నీటిమట్టం..6 గేట్లు 5 అడుగుల మేర తెరిచి 3072 క్యూసెక్కుల నీటిని ఉస్మాన్ సాగర్ నుంచి విడుదల చేశారు అధికారులు.. 4 గేట్లు 4 అడుగుల మేర తెరిచి 5215 క్యూసెక్కుల నీటిని మూసి లోకి విడుదల చేశారు.

Also Read:Renu Desai పవన్ ఫ్యాన్స్‌కు..రేణూ దేశాయ్ ఘాటైన వార్నింగ్

జంట జలాశయాల నుంచి 8 వేల క్యూసెక్కుల నీటిని మూసి లోకి విడుదల చేశారు. జంట జలాశయాలనుంచి వస్తున్న వరద తాకిడికి ఉదృతంగా ప్రవహిస్తున్న మూసి.. మూసి ప్రవాహంతో పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.. మూసి ప్రవాహానికి మూసారాంబాగ్ బ్రిడ్జి పైనుంచి ప్రవహిస్తున్న వరద.. నిన్న సాయంత్రం నుండి బ్రిడ్జిపై నుంచి రాకపోకలు నిలిపివేసిన అధికారులు.. ముసారంబాగ్ మూసివేతతో గోల్నాక బ్రిడ్జిపై పెరిగిన ట్రాఫిక్ రద్దీ.. మూసి పరివాహక ప్రాంతమైన జియాగూడ 100 ఫీట్ రోడ్డుపై కూడా వరద ప్రవహిస్తోంది.. వరద ప్రవాహానికి జియాగూడ 100 ఫీట్ రోడ్డుపై రాకపోకల నిలిపివేశారు. పురాణ పూల్ వద్ద కూడా మూసి ఉదృతంగా ప్రవహిస్తోంది.

Exit mobile version