Site icon NTV Telugu

RRR for Oscars : రాజమౌళి ఆశలు ఫలించేనా.? ట్రిపుల్ఆర్‎కు ఆస్కార్ దక్కేనా.. ?

Rrr Free On Zee5

Rrr Free On Zee5

RRR for Oscars : దర్శకధీరుడు రాజమౌళి తాను నిర్మించిన ట్రిపుల్ఆర్ సినిమాకు ఆస్కార్ దగ్గాలని కష్టపడుతున్నారు. ఇండియన్ మూవీగా భారతదేశ ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆస్కార్ కి నామినేట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ట్రిపుల్‎ఆర్ కాకుండా ఆస్కార్‌కి గుజరాతీ మూవీ ‘ది లాస్ట్ మూవీ షో’ని నామినేట్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. అయితే జనరల్ ఎంట్రీ ద్వారా నామినేషన్స్ నిలవడానికి రాజమౌళి బృందం.. కొన్ని రోజులుగా ఆస్కార్ క్యాంపెయిన్ చేస్తున్న సంగతి విధితమే. ఈ క్రమంలో ‘RRR’ సినిమాకి డిసెంబర్ 21 ముఖ్యమైన రోజు. నేడు జ్యూరీ ఆస్కార్ నామినేషన్స్ జాబితా రాబోతుంది. ప్రతి క్యాటగిరీ నుంచి మొత్తం 15 షార్ట్ లిస్ట్ చేయనున్నారు. ఆ తరువాత 2023 జనవరి 24న, షార్ట్ లిస్ట్ చేసిన 15 నుంచి మళ్లీ ప్రతి క్యాటగిరీలో 5 షార్ట్ లిస్ట్ చేస్తారు. ఫైనల్ విన్నెర్స్ ని 2023 మార్చి 12న ప్రకటించనున్నారు. మరి ఈ లిస్ట్ లో RRR స్థానం దక్కించుకుందో లేదో చూడాలి. టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ ‘ RRR’. భారతీయ సినిమాగా విడుదలైన ఈ సినిమా ప్రపంచ సినీ వేదికలో కూడా మంచి ప్రజాధారణ సంపాదించుకుంది. అంతేకాదు అంతర్జాతీయ పురస్కారాల్లో కూడా అవార్డులను అందుకుంటూ హాలీవుడ్ చిత్రాలకి పోటీగా నిలిచింది. అయితే ఎన్ని అవార్డులు అందుకున్న RRR గురి అంతా ఆస్కార్ ని గెలుచుకోవడమే.

Exit mobile version