NTV Telugu Site icon

Puri Ratna Bhandar: పూరీ జగన్నాథుడి రత్న భాండాగారంలో ఆభరణాల లెక్కింపు నిలిపివేత..

Puri 1

Puri 1

పూరీ జగన్నాథుడి రత్న భాండాగారంలో ఆభరణాల తరలింపు ప్రక్రియను నిలిపివేశారు అధికారులు. బయటి రత్న భాండాగారంలోని అన్ని ఆభరణాలు తరలించామని ఆలయ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తెలిపారు. లోపల రత్న భాండాగారం తెరుచుకోకపోవడతో తాళాలు పగలగొట్టి తెరిచినట్లు పేర్కొన్నారు. లోపల రత్న భాండాగారంలో ఆభరణాలన్నీ అల్మారాలు, లాకర్లలో పెట్టారు. వాటిలోని ఆభరణాలు తరలించేందుకు సమయం సరిపోదని తెలిపారు. రేపు పూరీ జగన్నాథుడి రథయాత్ర తిరుగు ప్రయాణం ఉండటంతో ఆభరణాల తరలింపు ప్రక్రియ ఆపేసినట్లు అధికారులు చెప్పారు. మరోసారి హైలెవెల్ కమిటీ భేటీ అయిన తర్వాత.. సమయం నిర్ణయించుకుని లోపల రత్న భాండాగారంలో ఆభరణాల తరలింపు చేపడతామని పేర్కొన్నారు.

Read Also: Anant Ambani wedding: అంబానీ వివాహ కార్యక్రమంలోకి వెళ్లేందుకు యత్నించిన ఇద్దరు ఏపీ వాసులు..

బలభద్ర, సుభద్ర సమేత జగన్నాథ స్వామి వారి.. పూరీ జగన్నాథుడి క్షేత్రంలో రత్న భాండాగారంలోని భాండాగారంలో మణి రత్నాలు పొదిగినటువంటి అనేక విలువైన ఆభరణాలు ఉన్నాయని అన్నారు. పూరీ జగన్నాథుడికి భాండాగారంలో వజ్రా వైడూర్యాలు, కెంపులు, రత్నాలు, స్వర్ణా భరణాలు, వెండి తదితర విలువైన వస్తువులు ఉంటాయని అంటున్నారు. రాజులకాలంలోనూ ఇందులో స్వామివారికోసం చేయించిన నగలను దాచి పెట్టారని కొందరు చెబుతారు. దీంతో స్వామి వారి సంపద గురించి అందరిలో ఆసక్తి నెలకొంది.

Read Also: Salt: ఉప్పు అధికంగా తినడం వల్ల చాలా ప్రమాదం..డబ్య్లూహెచ్ వో ఏం చెప్తోంది..

దాదాపు 40 ఏళ్ల తర్వాత రత్న భాండాగారాన్ని తెరిచారు. అయితే.. ఉదయం నుంచి అందరూ ఉత్కంఠభరితంగా ఎదురు చూశారు. లోపల విష సర్పాలు ఉంటాయి కాబట్టి.. స్నేక్ క్యాచర్లను ఏర్పాటు చేశారు. ప్రత్యేక పూజలు చేసి ఆదివారం మధ్యాహ్నం 1.28 గంటలకు రహస్య గదిని తెరిచారు. రత్న భాండాగారం ఉన్న మూడో గదిలోకి 11 మందితో ఓ బృందం వెళ్లింది. ఆ గదిలోని నిధిని బయటకు తీసుకురావడానికి 6 భారీ పెట్టెలను తీసుకెళ్లారు.