మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో స్థానిక ఎమ్మెల్యే చిన్నయ్య కు వ్యతిరేకంగా ప్రచారం చేసిన శేజల్ ను బైండోవర్ చేశారు పోలీసులు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య లైంగికంగా వేధించాడని తనకు న్యాయం జరగడం లేదని కొంత కాలంగా పోరాడుతున్న శేజల్.. తాజాగా బెల్లంపల్లి లో దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా ఇంటింటా ప్రచారం చేసింది. అయితే.. ఆమెకు మద్దతుగా బీజేపీ నాయకులు నిలవడం గమనార్హం. అయితే.. శేజల్ ప్రచారాన్ని అడ్డుకోవడం కోసం బీఆర్ఎస్ నాయకులు రావడంతో.. బీఆర్ఎస్ నాయకులకు బీజేపీ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించిందని తహశీల్దార్ సుధాకర్ ముందు బైండోవర్ చేశారు పోలీసులు.
Also Read : Health Tips : రొయ్యలను ఎక్కువ తింటే ఏమౌతుందో తెలిస్తే షాక్ అవుతారు..
బెల్లంపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోలోని బజారు ఏరియాలో కొంతమంది బీజేపీ లీడర్స్ తో కలిసి అరిజియాన్ అండ్ డైరీ సీఈఓ శేజల్ లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చే విధంగా ప్రజా శాంతి కి భంగం కలిగి ఇచ్చే విధంగా గుంపుగా బజార్ ఏరియా లో తిరుగుతు ఉoడంతో ఏలాంటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలలో భాగంగా బెల్లంపల్లి తహసీల్దార్ సుధాకర్ ఎదుట బైండోవర్ చేయడం జరిగిందని పోలీసులు వెల్లడించారు. బెల్లంపల్లి తహసీల్దార్ సుధాకర్ బైండోవర్ కాబడిన శేజల్ 6 నెలల కాల వ్యవధిలో మరల నేరానికి పాల్పడితే వారికి బైండోవర్ ఉల్లంఘన నేరం కింద రెండు లక్ష రూపాయల జరిమాన లేదా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తెలియజేస్తూ శేజల్ పర్సనల్ పూచీకత్తుపై వదిలిపెట్టినట్లు తెలిపారు.
Also Read : Viral Video: పెళ్లికి ముందే కక్కుర్తి పడ్డ జంట.. స్టేజ్ పైనే ఆ పని.. షాక్ లో బంధువులు..