NTV Telugu Site icon

Heavy Rains: తెలంగాణలోని పది జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్..

Telagnana Rain Alert

Telagnana Rain Alert

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పది జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. భద్రాది కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ ఐఎండీ అలెర్ట్ జారీ చేసింది. అంతేకాకుండా.. ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఆ పది జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరోవైపు.. హైదరాబాద్తో పాటు పరిసర జిల్లాల్లో సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

YS Jagan: ముగిసిన వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. ఎంపీలకు జగన్‌ దిశానిర్దేశం

కాగా.. ఈరోజు సాయంత్రం లోపు అల్పపీడనం తీరం దాటనున్నది. ఈ క్రమంలో.. రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ముఖ్యంగా వరంగల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పింది. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది. మరోవైపు.. ఉత్తర తెలంగాణలో ఈ నెల 20 , 21వ తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రభుత్వం అధికారులను అలర్ట్ చేసింది. ఆయా జిల్లాల కలెక్టర్లు అలర్ట్గా ఉండాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. నిన్న (శుక్రవారం) రాత్రి కలెక్టర్లు, జిల్లాల ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు.