Oracle: ఒరాకిల్‌కు 21 ఏళ్లలో అతిపెద్ద నష్టం.. రూ. 1.20 లక్షల కోట్లు కోల్పోయిన లారీ ఎల్లిసన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Oracle: ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీల్లో ఒకటైన ఒరాకిల్ షేర్లు దాదాపు 14 శాతం క్షీణతతో ముగిశాయి. 21 ఏళ్ల తర్వాత కంపెనీ షేర్లలో అతిపెద్ద క్షీణత కనిపించింది. కంపెనీ ఆదాయంలో క్షీణత, రాబోయే నెలల్లో ఆదాయంలో ఆశించిన దానికంటే తక్కువ వృద్ధి స్టాక్ తగ్గడానికి దారితీసింది. ఒరాకిల్ షేర్ల పతనం కారణంగా కంపెనీ వ్యవస్థాపకుడు లారీ ఎలిసన్ సంపద 10 శాతానికి పైగా క్షీణించింది. ఆ తర్వాత అతను ప్రపంచంలోని నాల్గవ సంపన్న వ్యాపారవేత్త నుండి ఐదవ స్థానానికి పడిపోయాడు.
14శాతం క్షీణించిన కంపెనీ షేర్లు
న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం.. కంపెనీ షేర్లు 13.50 శాతం క్షీణతతో 109.61 డాలర్ల వద్ద ముగిశాయి. కంపెనీ షేర్లు గత ఐదు రోజుల్లో 11 శాతం క్షీణించగా, ఒక నెలలో 5 శాతానికి పైగా క్షీణించాయి. కంపెనీ షేర్లు ఈరోజు ట్రేడింగ్ సెషన్లో 15 శాతానికి పైగా పడిపోయి 107.30డాలర్లకి చేరాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాబోయే ట్రేడింగ్ సెషన్లో కంపెనీ షేర్లు మరింత పడిపోయే అవకాశం ఉంది.
Also Read
- IMD Alert: కోనసీమకు మరో ముప్పు.. అర్నబ్ వెనుకే మరో వాయుగుండం..
- Flavio Bolsonaro: అమెరికాకు పారిపోయిన బ్రెజిల్ అధ్యక్ష అభ్యర్థి.. లూలా గెలుపు తర్వాత కీలక పరిణామం!
- Gold Hunt: ఓ వైపు తుఫాన్.. మరోవైపు ఉప్పాడ తీరంలో బంగారం కోసం వేట..
- Bangladesh: షేక్ హసీనా వీడియో వివాదం.. బంగ్లాదేశ్ మాజీ ఎయిర్‌ఫోర్స్ అధికారి మృతి..
Read Also:Sobitha Dhulipala : సినిమాల విషయంలో నాకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి…
21 ఏళ్ల తర్వాత అతిపెద్ద పతనం
21 ఏళ్లలో ఒరాకిల్ షేర్లలో ఇదే అతిపెద్ద క్షీణత. చివరిసారిగా మార్చి 2002లో డాట్-కామ్ మాంద్యం సమయంలో కంపెనీ స్టాక్‌లో 15 శాతం భారీ క్షీణత కనిపించింది. ఆ తర్వాత కంపెనీ షేర్లలో ఇంత భారీ క్షీణత ఎప్పుడూ కనిపించలేదు. కంపెనీ క్షీణత ప్రభావం ప్రపంచంలోని మరో రెండు టెక్ కంపెనీల షేర్లలో కనిపించింది. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ షేర్లు ఒక శాతం కంటే ఎక్కువ పడిపోయాయి. మైక్రోసాఫ్ట్ షేర్లు దాదాపు 2 శాతం క్షీణించాయి.
మంగళవారం పతనం కారణంగా ఒరాకిల్ ఛైర్మన్ లారీ ఎల్లిసన్ దాదాపు 14.6 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూశారు. అంటే మన కరెన్సీలో రూ. 1.21 లక్షల కోట్లు. ప్రస్తుతం అతని మొత్తం సంపద 126 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీనికి ముందు అతను ప్రపంచంలోని నాల్గవ సంపన్న వ్యాపారవేత్త. ఈ క్షీణత తర్వాత, అతను బిల్ గేట్స్ కంటే వెనుకబడి ఐదవ స్థానానికి చేరుకున్నాడు. కాగా, బిల్ గేట్స్ సంపద 129 బిలియన్ డాలర్లు. వారెన్ బఫెట్ 6వ స్థానంలో ఉన్నారు. వీరి వద్ద మొత్తం 123 బిలియన్ డాలర్లు ఉన్నాయి.
Read Also:Hyderabad: జహీరాబాద్‌లో విశాల్ షిండే హత్య కేసు.. నిందితుడు నజీర్ అహ్మద్ మృతి
షేర్లు ఎందుకు పడిపోయాయి?
ఒరాకిల్ ఆదాయాలు అంచనాల కంటే తక్కువగా ఉన్నాయి. ఈ త్రైమాసికంలో కంపెనీకి 12.45 బిలియన్ డాలర్లు వచ్చాయి. ఇది 12.47 బిలియన్ డాలర్ల అంచనా కంటే తక్కువ. ప్రస్తుత త్రైమాసికానికి కూడా ఒరాకిల్ ఎటువంటి నిర్దిష్ట అంచనాను సమర్పించలేదు. ప్రస్తుత త్రైమాసికంలో ఆదాయం 5 నుంచి 7 శాతంగా ఉండవచ్చని, ఇది సగటు అంచనా 8 శాతం కంటే తక్కువగా ఉంటుందని ఒరాకిల్ తెలిపింది.
తాజావార్తలు
-
KTR : పంటలు ఎండిపోతుంటే.. మూసీ సుందరీకరణ ఏంటి.?
-
Honey Trap పోలీసు అధికారులే టార్గెట్‌గా రూ.లక్షల్లో వసూళ్లు!
-
IMD Alert: కోనసీమకు మరో ముప్పు.. అర్నబ్ వెనుకే మరో వాయుగుండం..
-
Flavio Bolsonaro: అమెరికాకు పారిపోయిన బ్రెజిల్ అధ్యక్ష అభ్యర్థి.. లూలా గెలుపు తర్వాత కీలక పరిణామం!
-
ESI Scam : ESIలో ఇదేం దందా.? క్లీనింగ్ కాంట్రాక్ట్‌లో కోట్ల కుంభకోణం..
ట్రెండింగ్
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..