Site icon NTV Telugu

OPPO Reno14: 1.5K 120Hz AMOLED డిస్‌ప్లే, డైమెన్సిటీ 8450 ప్రాసెసర్, IP69 రేటింగ్‌తో ఓప్పో రెనో14, రెనో14 ప్రో లాంచ్..!

Oppo Reno14

Oppo Reno14

OPPO Reno14: ఓప్పో తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు రెనో14, రెనో14 ప్రో మోడళ్లను చైనాలో గ్రాండ్‌గా విడుదల చేసింది. ఈ ఫోన్లు పాత మోడల్ అయిన రెనో13కి సక్సెసర్‌గా వచ్చాయి. రెనో14లో 6.59 అంగుళాల ఫ్లాట్ AMOLED డిస్‌ప్లే ఉంటే, రెనో14 ప్రోలో 6.83 అంగుళాల ఫ్లాట్ AMOLED డిస్‌ప్లే ఉంది. ఇవి 1.5K రెసల్యూషన్, 120Hz రిఫ్రెష్‌రేట్, 3840Hz PWM డిమ్మింగ్ వంటి ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకోనున్నాయి. రెనో14 డివైస్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్‌తో వస్తుండగా, రెనో14 ప్రో కొత్త డైమెన్సిటీ 8450 చిప్‌సెట్‌ తో వస్తుంది. రెండు ఫోన్లలోనూ నానో ఐస్ క్రిస్టల్ హీట్ సింక్‌తో మూడు రెట్లు అధిక హీట్ మేనేజ్మెంట్ సామర్థ్యం కలిగి ఉన్నాయి.

Read Also: Weather Update : అగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. తెలంగాణ భారీ వర్ష సూచన

ఇవే కాకుండా, రెండు ఫోన్లు IP66, IP68, IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్‌తో పర్ఫెక్ట్ ప్రొటెక్షన్‌ను అందిస్తున్నాయి. 50MP ట్రిపుల్ కెమెరా సెటప్, 50MP సెల్ఫీ కెమెరా, 4K 60fps వీడియో రికార్డింగ్, ఆప్టికల్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సర్ వంటి ఆధునిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. రెనో14లో 6000mAh బ్యాటరీ ఉంది. ఇక ప్రో మోడల్ 6200mAh బ్యాటరీతో వస్తోంది. రెండు మోడళ్లకూ 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. ప్రో మోడల్‌కు అదనంగా 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. వినియోగదారుల కోసం రెనో14 మోడల్ రీఫ్ బ్లాక్, పినెలియా గ్రీన్, మర్మెయిడ్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. అలాగే రెనో14 ప్రో రీఫ్ బ్లాక్, కాలా లిల్లీ పర్పుల్ మరియు మర్మెయిడ్ కలర్స్‌తో ‘వెల్వెట్ గ్లాస్’ ఫినిష్‌ను అందిస్తోంది.

Read Also: Boycott Turkey: తమది తుర్కియే సంస్థే కాదు.. సెలెబీ ప్రకటన

ఇక ధరల విషయంలో వేరియంట్లు బట్టి వివిధ దరు ఉన్నాయి.
OPPO Reno14 ధరలు:

12GB+256GB – 2799 యువాన్స్ (దాదాపు రూ. 33,245)

16GB+256GB – 2999 యువాన్స్ (రూ. 35,620)

12GB+512GB – 3099 యువాన్స్ (రూ. 36,790)

16GB+512GB – 3299 యువాన్స్ (రూ. 39,170)

16GB+1TB – 3799 యువాన్స్ (రూ. 45,105)

OPPO Reno14 Pro ధరలు:

12GB+256GB – 3499 యువాన్స్ (రూ. 41,560)

12GB+512GB – 3799 యువాన్స్ (రూ. 45,105)

16GB+512GB – 3999 యువాన్స్ (రూ. 47,500)

16GB+1TB – 4499 యువాన్స్ (రూ. 53,435).

Exit mobile version