OPPO Reno 10 Series Launch: నేడే ఒప్పో రెనో 10 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ డీటెయిల్స్ ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OPPO Reno 10 Series 5G Launch Today In India: భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో నేడు సరికొత్త సిరీస్ లాంచ్ కానుంది. అదే ‘ఒప్పో రెనో 10’ 5జీ. ఈ సిరీస్‌లో భాగంగా మొత్తం మూడు స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్ అవుతున్నాయి. ఒప్పో రెనో 10 (Oppo Reno 10), ఒప్పో రెనో 10 ప్రో (Oppo Reno 10 Pro), ఒప్పో రెనో 10 ప్రో ప్లస్ (Oppo Reno 10 Pro Plus) 5జీ స్మార్ట్ఫోన్లు నేటి మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవనున్నాయి. ఒప్పో రెనో 10 సిరీస్ ఇప్పటికే చైనాలో అందుబాటులో ఉంది. భారతదేశంలో ఒప్పో ఇండియా వెబ్సైట్ మరియు ఆఫ్‌లైన్ రిటైల్ భాగస్వాములతో పాటు ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫాన్స్ అందుబాటులో ఉంటాయి.
OPPO Reno 10 Series Features:
ఆప్టికల్ ఇమేజ్ స్టెబులైజేషన్తో కూడిన తొలి 64 ఎంపీ టెలిఫొటో పోట్రైట్ కెమెరా ఒప్పో రెనో 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్‌లో ఉంటుందని తెలుస్తోంది. 3డీ కర్వ్డ్ స్క్రీన్ కూడా వీటిలో వస్తుందని సమాచారం. చైనాలో ఒప్పో రెనో 10 5జీ స్మార్ట్ఫోన్లు ఐస్ బ్లూ, సిల్వరీ గ్రే కలర్స్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన డిస్ప్లే, 32ఎంపీ టెలిఫొటో పోట్రైట్ కెమెరా ఉంటాయి.
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
Also Read: Electricity Bill: పూరి గుడిసెకు రూ. 3,31,951 విద్యుత్తు బిల్లు.. షాక్‌లో కుటుంబ సభ్యులు!
OPPO Reno 10 Series Camera:
ఒప్పో రెనో 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్‌లో 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఉంటుందని సమాచారం. వీటిలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ఆక్టా కోర్ చిప్సెట్ వస్తుంది. ఒప్పో రెనో 10 ప్రో, ఒప్పో రెనో 10 ప్రో ప్లస్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 చిప్ సెట్స్ ఉండనున్నాయి. 50ఎంపీ ప్రైమరీ కెమెరా ఉండనుంది. అయితే రెనో 10 ప్రో ప్లస్‌లో 64ఎంపీ టెలిఫొటో పోట్రైట్ కెమెరా కూడా ఉంటుంది.
OPPO Reno 10 Series Price:
ఒప్పో 10 సిరీస్ ఫోన్లు 5,000mAh బ్యాటరీతో వస్తాయని సమాచారం తెలుస్తోంది. ఇది 47 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయగల 67W ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తాయి. ఒప్పో రెనో 10 ధర రూ. 38,99.. ఒప్పో రెనో 10 ప్రో ధర రూ. 44,999గా.. ఒప్పో రెనో 10 ప్రో ప్లస్ ధర రూ. 59,999గా ఉంటుందని సమాచారం. నేడు ఈ ఫోన్ లాంచ్ అయ్యాక పూర్తి వివరాలు తెలియరానున్నాయి.
Also Read: Harry Brook Record: ఇంగ్లండ్ చిరస్మరణీయ విజయం.. ప్రపంచ రికార్డు నెలకొల్పిన హ్యారీ బ్రూక్!
తాజావార్తలు
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!