NTV Telugu Site icon

OPPO Reno 10 Series Launch: నేడే ఒప్పో రెనో 10 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ డీటెయిల్స్ ఇవే!

Oppo Reno 10 Series Launch

Oppo Reno 10 Series Launch

OPPO Reno 10 Series 5G Launch Today In India: భారత స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లో నేడు సరికొత్త సిరీస్​ లాంచ్ ​కానుంది. అదే ‘ఒప్పో రెనో 10’ 5జీ. ఈ సిరీస్​లో భాగంగా మొత్తం మూడు స్మార్ట్​ఫోన్స్​ రిలీజ్ అవుతున్నాయి. ఒప్పో రెనో 10 (Oppo Reno 10), ఒప్పో రెనో 10 ప్రో (Oppo Reno 10 Pro), ఒప్పో రెనో 10 ప్రో ప్లస్ (Oppo Reno 10 Pro Plus)​ 5జీ స్మార్ట్‌ఫోన్‌లు నేటి మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవనున్నాయి. ఒప్పో రెనో 10 సిరీస్ ఇప్పటికే చైనాలో అందుబాటులో ఉంది. భారతదేశంలో ఒప్పో ఇండియా వెబ్‌సైట్ మరియు ఆఫ్‌లైన్ రిటైల్ భాగస్వాములతో పాటు ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫాన్స్ అందుబాటులో ఉంటాయి.

OPPO Reno 10 Series Features:
ఆప్టికల్​ ఇమేజ్​ స్టెబులైజేషన్​తో కూడిన తొలి 64 ఎంపీ టెలిఫొటో పోట్రైట్​ కెమెరా ఒప్పో రెనో 10 సిరీస్ స్మార్ట్​ఫోన్స్​లో ఉంటుందని తెలుస్తోంది. 3డీ కర్వ్​డ్​ స్క్రీన్​ కూడా వీటిలో వస్తుందని సమాచారం. చైనాలో ఒప్పో రెనో 10 5జీ స్మార్ట్‌ఫోన్‌లు ఐస్​ బ్లూ, సిల్వరీ గ్రే కలర్స్​లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన డిస్​ప్లే, 32ఎంపీ టెలిఫొటో పోట్రైట్​ కెమెరా ఉంటాయి.

Also Read: Electricity Bill: పూరి గుడిసెకు రూ. 3,31,951 విద్యుత్తు బిల్లు.. షాక్‌లో కుటుంబ సభ్యులు!

OPPO Reno 10 Series Camera:
ఒప్పో రెనో 10 సిరీస్ స్మార్ట్​ఫోన్స్​లో 8 జీబీ ర్యామ్​, 256 జీబీ స్టోరేజ్​ ఉంటుందని సమాచారం. వీటిలో క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 778జీ ఆక్టా కోర్​ చిప్​సెట్​ వస్తుంది. ఒప్పో రెనో 10 ప్రో, ఒప్పో రెనో 10 ప్రో ప్లస్​లో మీడియాటెక్​ డైమెన్సిటీ 8200, క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 8 ప్లస్​ జెన్​ 1 చిప్​ సెట్స్​ ఉండనున్నాయి. 50ఎంపీ ప్రైమరీ కెమెరా ఉండనుంది. అయితే రెనో 10 ప్రో ప్లస్​లో 64ఎంపీ టెలిఫొటో పోట్రైట్​ కెమెరా కూడా ఉంటుంది.

OPPO Reno 10 Series Price:
ఒప్పో 10 సిరీస్ ఫోన్‌లు 5,000mAh బ్యాటరీతో వస్తాయని సమాచారం తెలుస్తోంది. ఇది 47 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయగల 67W ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తాయి. ఒప్పో రెనో 10 ధర రూ. 38,99.. ఒప్పో రెనో 10 ప్రో ధర రూ. 44,999గా.. ఒప్పో రెనో 10 ప్రో ప్లస్ ధర రూ. 59,999గా ఉంటుందని సమాచారం. నేడు ఈ ఫోన్ లాంచ్ అయ్యాక పూర్తి వివరాలు తెలియరానున్నాయి.

Also Read: Harry Brook Record: ఇంగ్లండ్‌ చిరస్మరణీయ విజయం.. ప్రపంచ రికార్డు నెలకొల్పిన హ్యారీ బ్రూక్‌!

Show comments