Site icon NTV Telugu

9500 ప్రాసెసర్‌, 1.5K AMOLED డిస్‌ప్లే, హెవీ మల్టీటాస్కింగ్‌తో Oppo K14 Turbo Series లాంచ్

Oppo

Oppo

Oppo K14 Turbo Series: గత సంవత్సరం ఆగస్టులో ఒప్పో సంస్థ భారత్‌లో Oppo K13 Turbo Proతో పాటు Oppo K13 Turboను రిలీజ్ చేసింది. ఈ రెండు ఫోన్లు గేమింగ్, హై-పర్ఫార్మెన్స్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని మార్కెట్లోకి తీసుకొచ్చింది. తాజాగా, కంపెనీ కొత్త Oppo K14xను ఫిబ్రవరి 10వ తేదీన భారత మార్కెట్‌లో ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది.

Read Also: Delhi Capitals: పాపం ఢిల్లీ క్యాపిటల్స్‌.. భారీ స్కోరు చేసినా దక్కిని ఫలితం! ఈ బాధ వర్ణణాతీతం

లాంచ్ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్లు:
Oppo K14 సిరీస్‌లోని ఇతర మోడల్స్ పేర్లను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే, Oppo K14 Turbo, Oppo K14 Turbo Pro ఫోన్లకు సంబంధించిన లాంచ్ టైమ్‌లైన్, కీలక స్పెసిఫికేషన్లు, RAM–స్టోరేజ్ వేరియంట్లు, కలర్ ఆప్షన్లు ఆన్‌లైన్‌లో మాత్రం లీక్ అయ్యాయి. ఈ రెండు ఫోన్లు MediaTek Dimensity 9000 సిరీస్ చిప్‌సెట్లతో రాబోతున్నట్లు సమాచారం.

ఏప్రిల్‌లో లాంచ్?:
అయితే, ఈ రెండు ఫోన్లు Oppo K14 Turbo, Oppo K14 Turbo Pro పేర్లతో విడుదల కానున్నట్లు తెలుస్తుంది. మొదట ఇవి Oppo K15 Turbo, Oppo K15 Turbo Proగా చైనాలో లాంచ్ అవుతాయని టెక్ నిపుణులు భావించారు. అధికారిక తేదీ మాత్రం ఇంకా ప్రకటించకపోయినా, ఏప్రిల్ నెలలో చైనా మార్కెట్‌లో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.

Read Also: Ramayana : రాజమౌళి రేంజ్ ప్రమోషన్స్‌తో ‘రామాయణం’.. ఫస్ట్ లుక్ రివీల్‌కు ముహూర్తం ఫిక్స్!

డిస్‌ప్లే వివరాలు
* Oppo K14 Turboలో 6.59 ఇంచుల డిస్‌ప్లే
* Oppo K14 Turbo Proలో 6.78 ఇంచుల పెద్ద స్క్రీన్
* యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌
* Dimensity 9500 చిప్‌సెట్‌
* 3nm ప్రాసెస్‌
* MediaTek Dimensity 9500 చిప్‌సెట్‌

RAM, స్టోరేజ్:
12GB RAM + 256GB స్టోరేజ్,
12GB + 512GB,
16GB + 512GB వేరియంట్లు

కలర్ ఆప్షన్లు:
* వైట్,
* గ్రే,
* పింక్,
* ఫోర్జ్డ్ కార్బన్ షేడ్స్
ఈ ఫోన్ల బరువు 201 గ్రాములు

Read Also: TGBIE Affiliation 2026-27: ఇంటర్ కళాశాలల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం..

భారత్‌లో Oppo K13 Turbo సిరీస్ స్పెక్సీ:
భారత్‌లో లాంచ్ అయిన Oppo K13 Turbo అండ్ Oppo K13 Turbo Pro ఫోన్లు వరుసగా రూ.27,999, రూ.37,999 ప్రారంభ ధరలతో (8GB RAM + 256GB) అందుబాటులోకి వచ్చాయి. స్టాండర్డ్ మోడల్ ఫస్ట్ పర్పుల్, నైట్ వైట్, మిడ్‌నైట్ మ్యావరిక్ రంగుల్లో లభిస్తుండగా, ప్రో మోడల్ మిడ్‌నైట్ మ్యావరిక్, పర్పుల్ ఫాంటమ్, సిల్వర్ నైట్ షేడ్స్‌లో విక్రయించబడుతోంది.

డిస్‌ప్లే ఫీచర్లు:
Oppo K13 Turbo సిరీస్ ఫోన్లలో ఇన్‌బిల్ట్ కూలింగ్ ఫ్యాన్‌తో పాటు 7,000 స్క్వేర్ మిల్లీమీటర్ల వేపర్ కూలింగ్ చాంబర్‌ను జోడించారు. ఈ ఫోన్లలో 6.80 ఇంచుల 1.5K AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ సాంప్లింగ్ రేట్, 1,600 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ ఫీచర్లు ఉన్నాయి. స్టాండర్డ్ మోడల్‌లో MediaTek Dimensity 8450 చిప్‌సెట్ ఉండగా, ప్రో మోడల్‌లో Snapdragon 8s Gen 4 ప్రాసెసర్‌ను అందించారు. Oppo K14 Turbo సిరీస్‌కు సంబంధించి కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి ప్రస్తుతం లీక్ అయిన ఈ వివరాలను ప్రాథమిక సమాచారం గానే పరిగణించాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.

Exit mobile version