NTV Telugu Site icon

Oppo Find X8 Price: ఒప్పో ఫైండ్‌ X8 సిరీస్‌ విడుదల.. కెమెరా రాక్స్, రేట్ పీక్స్!

Oppo Find X8 Price

Oppo Find X8 Price

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ ‘ఒప్పో’ రెండు ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఫైండ్‌ ఎక్స్‌ 8 సిరీస్‌లో ఒప్పో ఫైండ్‌ ఎక్స్‌8, ఒప్పో ఫైండ్‌ ఎక్స్‌ 8 ప్రోలను లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లూ ఔటాఫ్‌ ది బాక్స్ ఆండ్రాయిడ్‌ 15, మీడియాటెక్‌ డైమెన్‌సిటీ 9400 చిప్‌సెట్‌తో వస్తున్నాయి. నాలుగు సెన్సర్ల కెమెరాలు, 5910 ఎంఏహెచ్‌ బ్యాటరీతో ప్రో మోడల్ వస్తోంది. ఈ ఫోన్ ధర లక్ష ఉండడం విశేషం.

ఒప్పో ఫైండ్‌ ఎక్స్8 స్మార్ట్‌ఫోన్‌ 12జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.69,999గా ఉండగా.. 16జీబీ+512జీబీ వేరియంట్ ధర రూ.79,999గా ఉంది. స్టార్‌ గ్రే, స్పేస్ బ్లాక్‌ రంగుల్లో ఈ ఫోన్‌ లభిస్తుంది. ఒప్పో ఫైండ్‌ ఎక్స్‌8 ప్రో సింగిల్‌ వేరియంట్‌లో మాత్రమే వస్తోంది. ఈ ఫోన్ ధర రూ.99,999గా కంపెనీ నిర్ణయించింది. పెరల్‌ వైట్‌, స్పేస్‌ బ్లాక్‌ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. డిసెంబర్‌ 3 నుంచి ఒప్పో ఇ-స్టోర్‌, ప్లిప్‌కార్ట్‌తో అమ్మకానికి అందుబాటులోకి వస్తాయి.

ఒప్పో ఫైండ్‌ ఎక్స్8 ఫీచర్స్:
# 6.59 ఇంచెస్ ఎల్‌టీపీఓ అమోలెడ్‌ డిస్‌ప్లే
# 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేటు
# 4,500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌
# మీడియాటెక్‌ డైమెన్‌సిటీ 9400 చిప్‌సెట్‌
# ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత కలర్‌ ఓఎస్‌ 15
# ఐపీ68/ఐపీ69 రేటింగ్‌
# 50 ఎంపీ సోనీ ఎల్‌టీవై-700 ప్రధాన సెన్సర్‌, 50 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, 50 ఎంపీ పెరిస్కోప్‌ టెలిఫొటో లెన్స్‌
# 5,630 ఎంఏహెచ్‌ బ్యాటరీ (80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌, 50 వాట్స్ ఎయిర్‌వూక్‌ ఛార్జింగ్‌)

Also Read: IND vs AUS: పెర్త్‌ టెస్ట్.. రోహిత్‌ శర్మ వచ్చేస్తున్నాడు!

#ఒప్పో ఫైండ్‌ ఎక్స్8 ప్రో ఫీచర్స్:
# 6.78 ఇంచెస్ ఎల్‌టీపీఓ అమోలెడ్‌ డిస్‌ప్లే
# 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేటు
# 4,500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌
# మీడియాటెక్‌ డైమెన్‌సిటీ 9400 చిప్‌సెట్‌
# ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత కలర్‌ ఓఎస్‌ 15
# ఐపీ68/ఐపీ69 రేటింగ్‌
# 50 ఎంపీ సోనీ ఎల్‌వైటీ-808 ప్రధాన సెన్సర్‌, 50 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్, 50 ఎంపీ పెరిస్కోపిక్‌ 3ఎక్స్‌ ఆప్టికల్‌ జూమ్‌, 50 ఎంపీ 6 ఎక్స్‌జూమ్‌ సెన్సర్‌
# 5,910 ఎంఏహెచ్‌ బ్యాటరీ (80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌, 50 వాట్స్ ఎయిర్‌వూక్‌ ఛార్జింగ్‌)

 

Show comments