Oppo F27 Pro+ 5G Price: ఒప్పో నుంచి వాటర్ ప్రూఫ్ 5జీ ఫోన్.. సూపర్ లుకింగ్!
- ఒప్పో మరో కొత్త 5జీ ఫోన్
- తొలి వాటర్ ప్రూఫ్ ఫోన్
- 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Oppo F27 Pro+ 5G Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ ‘ఒప్పో’ మరో కొత్త 5జీ ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఎఫ్ సిరీస్‌లో భాగంగా ‘ఒప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్’ స్మార్ట్‌ఫోన్‌ను గురువారం (జూన్ 13) రిలీజ్ చేసింది. నీరు, ధూళి వంటి వాటి నుంచి రక్షణ ఇచ్చే ఐపీ 69 సర్టిఫికేషన్స్‌తో ఈ ఫోన్ వస్తోంది. దేశీయ తొలి వాటర్ ప్రూఫ్ ఫోన్ ఇదే అని ఒప్పో కంపెనీ పేర్కొంటోంది.ఎఫ్ 27 ప్రో ప్లస్ ఫోన్ ఆర్మర్డ్ బాడీ, ప్రీమియం లెదర్ ఫినిషింగ్‌ని కలిగి ఉంది.
Oppo F27 Pro+ 5G Price:
ఒప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 8జీబీ+128జీబీ వేరయంట్ ధర రూ.27,999గా కాగా.. 8జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ.29,999గా ఉంది. ఇప్పటికే ఈ ఫోన్ ప్రీ ఆర్డర్స్ ప్రారంభం అయ్యాయి. జూన్ 20 నుంచి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఒప్పో ఆన్‌లైన్ స్టోర్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌లు లభిస్తాయి. ఒప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్ ఫోన్.. డస్క్ పింక్, మిడ్‌నైట్ నావీ రంగుల్లో లభించనుంది.
Also Read
- Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
- Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
- AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
- UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
Oppo F27 Pro+ 5G Specs:
ఒప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్ ఫోన్ 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 3డీ కర్వ్‌డ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేటుతో 950 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌తో ఇది వస్తోంది. డైమెనిసిటీ 7050 ప్రాసెసర్‌ను ఇందులో అమర్చారు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత కలర్ ఓఎస్‌తో ఈ ఫోన్ రన్ అవుతుంది.
Also Read: T20 World Cup 2024: ఉన్నపళంగా స్వదేశానికి ఇద్దరు భారత ఆటగాళ్లు.. కారణం ఏంటంటే?
Oppo F27 Pro+ 5G Camera and Battery:
ఒప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్ వెనక వైపు 64 ఎంపీ ప్రధాన కెమెరా, 2 ఎంపీ సెకండరీ సెన్సర్ ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందుభాగంలో 8 ఎంపీ కెమెరాను ఇచ్చారు. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 67W సూపర్ వూక్ ఛార్జింగ్ సదుపాయం ఉంది.
తాజావార్తలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
-
Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!