OPPO A5 5G: మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో విడుదలైన ఒప్పో A5..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OPPO A5 5G: ఒప్పో ఎప్పటికప్పుడు వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా మొబైల్‌లను మార్కెట్లోకి తీసుకొని వస్తోంది. ఒకసైడ్ బడ్జెట్ రేంజ్ మొబైల్స్, అలాగే మరోవైపు మిడ్ రేంజ్ మొబైల్స్ ను ఎక్కువగా అందుబాటులోకి తీసుకొని వచ్చే ఒప్పో మరోసారి ఒప్పో a5 5G తో ముందుకొచ్చేసింది. తాజాగా ఈ మొబైల్ ను భారతదేశంలో ఒప్పో విడుదల చేసింది. ధరకు మించి ఆకట్టుకునే ఫీచర్లతో ఈ మొబైల్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. మరి ఈ మొబైల్ పూర్తి ఫీచర్స్ ఏంటో ఒకసారి చూసేద్దామా..
డిస్ప్లే:
ఈ మొబైల్ 6.67 అంగుళాల హెచ్డి ప్లస్ ఎల్సి డిస్ప్లేతో వస్తుంది. ఇందులో 120hz రీఫ్రెష్ రేట్, 1000 నెట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంది. ఈ మొబైల్ డిస్ప్లేను కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. అంతేకాదు ఈ ఫోన్ కు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కూడా ఉంది. దీనివల్ల మొబైల్ కు అధిక ఉష్ణోగ్రత, తేమ వాటిని తట్టుకునే విధంగా రూపొందించారు. ఇందుకు తగ్గట్టుగానే మొబైల్లో IP65 రేటింగ్ కూడా ఉంది.
Read Also: Vivo X Fold 5: వివో నుంచి ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది.. 6000mAh బ్యాటరీ

Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ప్రాసెసర్:
ఒప్పో A5 5G లో డైమెన్ సిటీ 6300 చిప్ సెట్ ను వినియోగించారు. ఈ మొబైల్ 6GB/8GB ర్యాంతో లభిస్తుంది. అలాగే దీనిని మరో 8 జీబీ వరకు వర్చువల్ ర్యాంను జత చేసుకోవచ్చు. అలాగే ఈ మొబైల్లో 128GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుండగా, మెమొరీ కార్డు ద్వారా 1టీబీ వరకు విస్తరించుకునే అవకాశం కలదు. మొబైల్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత COLOUR OS 15పై ఆధారపడి పనిచేస్తుంది.

కెమెరా:
ఈ మొబైల్ లో కెమెరా పరంగా మంచి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇందులో 50MP ప్రధాన కెమెరా, 2MP మోనోక్రోమ్ సెన్సార్ తో కలిగిన రియల్ కెమెరా అందుబాటులో ఉంటుంది. అలాగే ముందు భాగంలో సెల్ఫీల కోసం 8MP కెమెరా అందుబాటులో ఉంటుంది. అయితే ఈ మొబైల్ కి ఫింగర్ ప్రింట్ సెన్సార్ మొబైల్ సైడ్ కు ఏర్పాటు చేశారు.

Read Also: Anil Kumar Yadav: వచ్చే నెల 3న నెల్లూరుకు వైఎస్ జగన్ వచ్చి తీరుతాడు..
బ్యాటరీ:
ఈ మొబైల్లో కెమెరాతో పాటు చెప్పుకోదగ్గ విషయం బ్యాటరీ. ఈ మొబైల్లో 6000mah భారీ బ్యాటరీ లభించనుంది. ఈ మొబైల్ కి 45w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను అందిస్తుంది. ఈ చార్జర్ ద్వారా 37 నిమిషాల్లో సగం బ్యాటరీని చార్జ్ చేయవచ్చు. ఈ బ్యాటరీ 5 సంవత్సరాలపాటు మెరుగైన పర్ఫామెన్స్ కనబరుస్తుందని కంపెనీ తెలుపుతోంది. వీటితోపాటు డ్యూయల్ సిమ్, బ్లూటూత్, 5g సపోర్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ధరలు:
ఒప్పో a5 మొబైల్ ఆరోరా గ్రీన్, మిస్ట్ వైట్ వంటి రెండు రంగులలో లభ్యం అవుతుంది. ఇక ఈ మొబైల్స్ ధరల విషయానికొస్తే.. 6gb+128gb వేరియంట్ ధర రూ. 15,499 గా ఉండగా, 8gb+128 జీబీ వేరియంట్ ధర రూ. 16,999గా నిర్ణయించారు. ఒప్పో ఇండియా ఆన్లైన్ స్టోర్ లో ఈ మొబైల్ అందుబాటులో ఉంది. అలాగే ఇతర ఆన్లైన్ ప్లాట్ఫారంలో, ఇంకా ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉంది.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!