NTV Telugu Site icon

Leopard: తమిళనాడులో ఆపరేషన్ చిరుత సక్సెస్..

Cheetha

Cheetha

తమిళనాడులో ఆపరేషన్ చిరుత విజయవంతమైంది. 9 గంటల పాటు శ్రమించి ఫారెస్ట్ సిబ్బంది చిరుతను పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తిరుపత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని సామ్ నగర్ ప్రాంతంలోని ఓ ఇంట్లోకి చిరుతపులి ప్రవేశించింది. ఈ క్రమంలో.. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే.. ఆ చిరుత ఇంట్లో నుంచి సమీపంలోని ప్రైవేట్ పాఠశాల ఆవరణలోకి దూకింది. అక్కడ పాఠశాల వాచ్​మెన్ రాజ గోపాల్​ తలపై చిరుత దాడి చేసి ఆ పక్కనే ఉన్న కార్​ సర్వీస్​ సెంటర్​లోకి వెళ్లింది.

Read Also: IND vs CAN: భారత్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్!

అందులో ఉన్న కొంతమంది చిరుతను చూసి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఓ కారులో ఎక్కి కూర్చున్నారు. ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని సురక్షితంగా బయటకు పంపించారు. చిరుత కారు షెడ్డులోనే ఉండటంతో.. ఫారెస్ట్ సిబ్బంది అక్కడికి చేరుకుని మత్తుమందు ఇచ్చి బంధించారు. ఈ ఆపరేషన్​లో 50మందిపైగా పోలీసులు పాల్గొన్నారు. పట్టుబడ్డ మగ చిరుతకు సుమారు నాలుగేళ్ల వయసు ఉంటుందని అధికారులు చెప్పారు. చిరుత దాడిలో గాయపడిన వాచ్​మెన్​ను క్రిష్ణగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Read Also: Agra: మద్యం మత్తులో వృద్ధురాలిపై యువకుడు అత్యాచారం..