Operation Ajay: 212మంది విద్యార్థులతో ఇజ్రాయెల్ నుండి ఢిల్లీకి చేరుకున్న తొలి విమానం.. ఇంకా 20 వేల మంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Ajay: ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో అనేక దేశాల పౌరులు కూడా మరణించారు. వీటన్నింటి మధ్య, ఇజ్రాయెల్ నుండి తన పౌరులు సురక్షితంగా తిరిగి రావడానికి భారతదేశం ఆపరేషన్ అజయ్‌ను ప్రారంభించింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ నుండి 212 మంది భారతీయ పౌరులతో కూడిన మొదటి బ్యాచ్ ఈ ఉదయం AI1140 విమానంలో న్యూఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. ఇజ్రాయెల్ నుండి తమ దేశానికి తిరిగి వచ్చిన ప్రయాణీకులకు స్వాగతం పలికేందుకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇజ్రాయెల్ యుద్ధంలో దేశం విడిచి వెళ్లాలనుకునే 212 మంది భారతీయులతో కూడిన మొదటి చార్టర్ విమానం గురువారం బెన్ గురియన్ విమానాశ్రయం నుండి బయలుదేరింది.
Read Also:Samsung Mobile : శాంసంగ్ నుంచి మరో రెండు ట్యాబ్లెట్లు.. ఫీచర్స్, ధర?
Also Read
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- India vs Sri Lanka: ఒకప్పుడు భారత్‌కు ప్రపంచకప్ అందించాడు.. ఇప్పుడు ఆ జట్టునే ఓడించేందుకు ప్లాన్..!
- Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
- India vs Sri Lanka: దేవదత్ పడిక్కల్‌కు తొలి టెస్టులో చోటు దక్కుతుందా? టీమిండియా కోచ్ కీలక అప్డేట్
ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ‘తమ ప్రభుత్వం ఏ భారతీయుడిని వదిలిపెట్టదని అన్నారు. మన ప్రభుత్వం, మన ప్రధానమంత్రి వారిని రక్షించి, సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి కట్టుబడి ఉన్నారు. మా పిల్లలను క్షేమంగా ఇంటికి చేర్చినందుకు విదేశాంగ మంత్రి డా. ఎస్. జైశంకర్.. అతని బృందానికి మేము కృతజ్ఞతలు’ తెలిపారు. అవసరమైతే వైమానిక దళాన్ని కూడా ఉపయోగించుకుంటామని, ప్రస్తుతానికి చార్టర్ విమానాలను ఉపయోగిస్తున్నామని.. ఈ ఉదయం 212 మందిని వెనక్కి తీసుకువస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న మన భారతీయ పౌరులు త్వరలో రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. దాదాపు 18000 మంది భారతీయులు ఇజ్రాయెల్‌లో ఉన్నారు. అందులో పెద్ద సంఖ్యలో విద్యార్థులు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు భారతీయులెవరూ గాయపడినట్లు సమాచారం లేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
#WATCH | Operation Ajay: First flight carrying 212 Indian nationals from Israel, lands in Delhi pic.twitter.com/iwT9ugIREP
— ANI (@ANI) October 13, 2023
Read Also:Nayanthara : సమంత కు స్పెషల్ గిఫ్ట్ పంపిన నయన్..
ఇజ్రాయెల్‌లో ఇప్పటివరకు 222 మంది సైనికులతో సహా 1300 మందికి పైగా మరణించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. 1973లో ఈజిప్ట్, సిరియాతో వారాలపాటు జరిగిన యుద్ధం తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు కనిపించలేదు. హమాస్ పాలనలో ఉన్న గాజా స్ట్రిప్‌లో మహిళలు,పిల్లలతో సహా కనీసం 1,417 మంది మరణించారు.
తాజావార్తలు
-
Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
-
Korean Kanakaraju Collections: వరుణ్ తేజ్‌కు బ్రేక్ఈవెన్.. 3 రోజుల్లోనే 37 కోట్లు కొల్లగొట్టిన ‘కొరియన్ కనకరాజు’!
-
Akhil Akkineni : పవన్ సాదినేని దర్శకత్వంలో అఖిల్ అక్కినేని
-
IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
-
Slum Dog 33 Temple Road: టబు పోలీస్ గెటప్.. పూరీ ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’ నుంచి మైండ్ బ్లోయింగ్ గ్లింప్స్!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!