Hyderabad Crime: హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న ఆన్ లైన్ సెక్స్ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. డేటింగ్ యాప్ ద్వారా వ్యభిచార దందా నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్నారు. ఉద్యోగం లేని అమ్మాయిలకు వల వేసి 60 వేల జీతం అంటూ వ్యభిచారంలోకి దింపి.. డేటింగ్ యాప్‌తో వ్యభిచారం చేస్తున్న ముఠాను గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
గౌలిదొడ్డిలోని కన్ క్లేవ్ హోటల్లో రైడ్ చేయగా పట్టుబడిన ఒక జంటను విచారించగా అసలు నిజం బయటపడింది. ప్రిన్స్ అనే వ్యక్తి శంషాబాద్ ఎయిరు ఉద్యోగి హాని ద్వారా హ్యాప్పీన్ యాప్‌లో అమ్మాయిల ఫోటోలు పెట్టినట్టు గుర్తించారు. గచ్చిబౌలిలోని హూ అపార్ట్మెంట్‌లో ఉంచి నెలకు 60 వేల జీతం అంటూ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. 60 వేల జీతం అనేసరికి పేద యువతులు ఈ రొంపిలోకి దిగుతున్నారు. పేదరికంతో ఇబ్బందులు పడుతూ ఉద్యోగాల కోసం వెతుకుతున్న అమ్మాయిలను టార్గెట్ చేసుకొని.. ఉద్యోగాలు ఇప్పిస్తామని, పెద్ద ఎత్తున డబ్బు వస్తుందని, విలాసవంతమైన లైఫ్ ఉంటుందని ట్రాప్ చేశారు.
CBI Investigations: హైదరాబాద్ లో సీబీఐ సోదాలు.. పాతబస్తీలో ఆరు చోట్ల అధికారులు తనిఖీలు
ఇదిలా ఉండగా.. ఇటీవల నగరంలో జరుగుతున్న వ్యభిచారం. హ్యూమన్ ట్రాఫికింగ్‌పై సైబరాబాద్ పోలీసులు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ పోలీసులు ప్రత్యేక టీమ్‌గా ఏర్పడి ఆపరేషన్ చేపట్టారు.
