Online Betting Be Aware: ఐపీఎల్ 2026 సందడి నేటి నుంచే మొదలు కావడంతో.. క్రికెట్ పట్ల మీకున్న అభిమానాన్ని క్రీడా స్ఫూర్తితోనే చాటుకోవాలని పోలీస్ బాస్ వీసీ సజ్జనార్ సూచించారు. కొందరు క్రికెట్ క్రేజ్ ను ఆసరాగా చేసుకుని బెట్టింగ్‌ల వైపు యువతను ప్రోత్సహిస్తున్నారని.. అది ఒక చిన్న ఆటగా మొదలై, చివరకు బతుకులను ఛిద్రం చేస్తోందని హెచ్చరించారు. ఇందుకు సంబంధించి ఆయన సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను రిలీజ్ చేశారు.
కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!
ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. క్రికెట్ బెట్టింగ్ అనేది సులభంగా డబ్బు సంపాదించే మార్గంలా కనిపిస్తుంది. కానీ, అది కేవలం ఒక భ్రమ మాత్రమే. ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్ ల ప్రకటనలకు ఆకర్షితులై చేతిలో ఉన్న సొమ్మును పోగొట్టుకోవడమే కాకుండా.. అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారఐ ఆయన అన్నారు. దీని వల్ల వారి కుటుంబాలు రోడ్డున పడతాయని ఆయన సూచించారు. ఇలాంటి అలవాట్ల వల్ల కేవలం వ్యక్తిగత నష్టమే కాకుండా.. తండ్రి కష్టార్జితాన్ని, తల్లి నగలను తాకట్టు పెట్టి బెట్టింగ్ కాసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయని.. గౌరవప్రదమైన కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని అన్నారు.
ఇక కొందరు బెట్టింగ్‌లో ఓడిపోయిన తర్వాత ఆ అప్పులను తీర్చలేక, పరువు పోతుందనే ఆందోళనతో ఎంతో మంది యువకులు ఆత్మహత్యల వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారని.. మరికొందరు అప్పులు తీర్చడానికి దొంగతనాలు, మోసాలకు పాల్పడి తమ ఉజ్వల భవిష్యత్తును జైలు పాలు చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కాబట్టి ఐపీఎల్ అనేది వినోదం కోసం ఉద్దేశించిన క్రీడ. గెలుపోటములు సహజం. వాటిని కేవలం టీవీ లేదా స్టేడియంలో చూసి ఆనందించాలే తప్ప, మీ సంపాదనను పందెంగా పెట్టకూడదని.. ముఖ్యంగా విద్యార్థులు, యువత తమ చదువుపై, కెరీర్‌పై దృష్టి పెట్టాలని ఆయన కోరారు.
గతంలో #SayNoToBettingApps ప్రచారం ద్వారా వందలాది యాప్‌లను ప్రభుత్వం నిషేధించినప్పటికీ, ఇప్పుడు టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికగా ఈ దందా కొత్త రూపం దాల్చింది. కేవలం డబ్బు కోసం ఇటువంటి ప్రమాదకరమైన యాప్‌లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం అని అన్నారు.
ఆన్‌లైన్ మాత్రమే కాకుండా ఫామ్ హౌస్‌లు, రహస్య ప్రాంతాల్లో సాగే ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లపై మా ప్రత్యేక నిఘా ఉందని అన్నారు. బెట్టింగ్ వల్ల అప్పులపాలై కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తెచ్చుకోవద్దు. మీ పరిసరాల్లో ఎవరైనా బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా మా వాట్సాప్ నంబర్ 9490616555 కు సమాచారం ఇవ్వండని ప్రజలను కోరారు.
బెట్టింగ్ ఊబిలో పడొద్దు.. బతుకును ఛిద్రం చేసుకోవద్దు!
ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న తరుణంలో క్రికెట్‌ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని, బెట్టింగ్ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం.
గతంలో #SayNoToBettingApps ప్రచారం ద్వారా వందలాది యాప్‌లను… pic.twitter.com/BA4uUttaIU
— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) March 28, 2026
