Online Betting App Scam: ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లపై ఈడీ పంజా.. బయటపడ్డ 200 షెల్ కంపెనీల నెట్వర్క్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Online Betting App Scam: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ మోసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న సోదాలకు గత వారం ఉత్తరాది, పశ్చిమ భారతంలో ఈడీ నిర్వహించిన మెరుపు దాడులే మూలకారణంగా తేలింది.
పూణే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద రంగంలోకి దిగిన ఈడీ, గత వారం ముంబై, పూణే, సూరత్, మెహసానా నగరాల్లోని 20కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో విస్తృత తనిఖీలు చేపట్టింది. ఈ సోదాల్లో అక్రమార్కుల ఆర్థిక మూలాలు బట్టబయలయ్యాయి. ముఖ్యంగా ‘ఐపైసా’ వంటి గేమింగ్ మరియు చెల్లింపుల ప్లాట్‌ఫామ్‌ల ద్వారా చట్టవిరుద్ధ బెట్టింగ్ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
Also Read
- YS Jagan: వైసీపీ అభ్యర్థులపై అష్ట కుట్రలు.. వీటిని ఎన్నికలంటారా?
- YS Jagan: సుప్రీంకోర్టు అంటే గౌరవం లేదు.. ప్రజలంటే విలువ లేదు!
- స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
- Rohit Sharma All Time Record: రోహిత్ శర్మ ఆల్-టైమ్ రికార్డు డేంజర్లో ఉందా..? ఆ సత్తా ఎవరికి ఉంది?
విచారణలో దిగ్భ్రాంతికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. సామాన్యులను ఆశచూపి కొల్లగొట్టిన సొమ్మును నేరుగా తరలించకుండా, దేశవ్యాప్తంగా 200లకు పైగా బోగస్ (షెల్) కంపెనీలు, పలు కో-ఆపరేటివ్ బ్యాంకుల ఖాతాలను ఉపయోగించి మళ్లించినట్లు ఈడీ తేల్చింది. ఈ నిధులను క్రిప్టోకరెన్సీలుగా మార్చి దుబాయ్‌తో పాటు ఇతర విదేశీ ఖాతాలకు చేరవేసినట్లు సాంకేతిక ఆధారాలు లభ్యమయ్యాయి.
గత వారం నిర్వహించిన సోదాల్లో పెద్ద ఎత్తున హార్డ్ డిస్క్‌లు, ల్యాప్‌టాప్‌లు, నగదు లావాదేవీల రికార్డులను స్వాధీనం చేసుకోవడంతో పాటు అనుమానాస్పద బ్యాంకు ఖాతాలను ఈడీ స్తంభింపజేసింది. అంతేకాకుండా ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన ఎడ్సోమ్ ఫిన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు రాంధానీని ఈడీ అరెస్ట్ చేసి విచారించింది. ఆ విచారణలో వెల్లడైన ఆధారాలు, సీజ్ చేసిన డిజిటల్ డేటా లింకుల ఆధారంగానే తాజాగా హైదరాబాద్, విజయవాడల్లోని లోకల్ ఏజెంట్లు, హవాలా ఆపరేటర్లపై ఈడీ ఏకకాలంలో దాడులకు దిగింది.
తాజావార్తలు
-
YS Jagan: వైసీపీ అభ్యర్థులపై అష్ట కుట్రలు.. వీటిని ఎన్నికలంటారా?
-
YS Jagan: సుప్రీంకోర్టు అంటే గౌరవం లేదు.. ప్రజలంటే విలువ లేదు!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Oppo Pad Mini: భారత్‌లో Oppo Pad Mini లాంచ్.. 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీ, ధర ఎంతంటే?
-
Online Betting App Scam: ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లపై ఈడీ పంజా.. బయటపడ్డ 200 షెల్ కంపెనీల నెట్వర్క్!
ట్రెండింగ్
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య