NTV Telugu Site icon

Onion Juice Benefits: ఉల్లిపాయ రసంను ఇలా వాడితే ఎన్ని ప్రయోజనాలో..

Onionjuice

Onionjuice

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదని నిపుణులు అంటున్నారు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. ఉల్లిరసం ను తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

పచ్చి ఉల్లిపాయల్లో విటమిన్లు, ఖనిజాలు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఉల్లిపాయల్లో క్వెర్సెటిన్ ఆర్గానిక్ సల్ఫర్ ఉంటాయి. ఇది శరీరంలో ఇన్సులిన్ సామర్థ్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది. ఫలితంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా ఉల్లిపాయలను తినవచ్చు. విటమిన్ సి, విటమిన్ సిక్స్, పొటాషియం, మాంగనీస్ మరియు కాపర్ పుష్కలంగా ఉన్నాయి. ఉల్లిపాయర రసం కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో ఉల్లిపాయ రసం తాగితే కిడ్నీ లో రాళ్లు, నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.. ఈ రసం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంటాయి. ఉల్లిపాయలో యాంటీ అలర్జీ, యాంటీ ఆక్సిడెంట్, కార్సినోజెనిక్ లక్షణాలు ఉంటాయి.. ఉల్లిపాయల్లో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది..

ఇకపోతే ఈ రసం ను తాగడం కీళ్ల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆవ నూనెను ఉల్లిపాయ రసంతో కలిపి మసాజ్ చేస్తే కూడా కీళ్ల నొప్పి తగ్గుముఖం పడతాయి.. జుట్టు సంరక్షణలో ఉల్లిపాయ బాగా పనిచేస్తుంది. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అలాగే జుట్టు, చర్మానికి కూడా ఉపయోగ పడుతుంది. కలబంద, కొబ్బరి నూనె మిక్స్ చేసి ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు రాస్తే జుట్టు రాలే సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.. బాదం నూనెతో ఉల్లిపాయ రసాన్ని మిక్స్ చేసి మీ తలకు పట్టించి బాగా మసాజ్ చేసి 20 నిమిషాలు నాననివ్వండి మరియు తేలికపాటి షాంపూతో కడగాలి. అందువల్ల, బాదం నూనె జుట్టుకు మెరుపును ఇస్తుంది, ఉల్లిపాయ రసం జుట్టు షాఫ్ట్‌ను బలపరుస్తుంది, జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. అలాగే పెరుగుదలను ప్రేరేపిస్తుంది..