Site icon NTV Telugu

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రన్ వే పై కొనసాగుతున్న ఆపరేషన్ చిరుత..

Chirutha

Chirutha

శంషాబాద్ విమానాశ్రయంలో చిరుతపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. ఆదివారం తెల్లవారుజామున విమానాశ్రయ పెట్రోలింగ్ సిబ్బంది రన్‌వేపై చిరుతను గుర్తించిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రన్ వే పై ఆపరేషన్ చిరుత కొనసాగుతుంది. వన్యప్రాణి విభాగం సిబ్బంది, జూ అధికారులు చిరుత కోసం అక్కడి పరిసర ప్రాంతాల్లో వెతుకుతున్నారు. తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి వద్ద చిరుత ఎయిర్ పోర్ట్ ప్రహరీ నుండి దూకడం.. చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు కూడా సంచరిస్తున్నట్లు ఎయిర్పోర్ట్ అధికారులు గుర్తించారు.

Drugs Sized: గుజరాత్ తీరంలో 602 కోట్ల డ్రగ్స్ స్వాధీన.. 14 మంది పాకిస్థానీలు అరెస్టు..

ఎయిర్ పోర్ట్ ప్రహరీ దూకుతుండగా ఫెన్సింగ్ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్ పోర్ట్ కంట్రోల్ రూమ్ లో అలారం మోగడంతో.. కంట్రోల్ రూమ్ సెక్యూరిటీ అధికారులు అప్రమత్తమయ్యారు. సీసీ కెమెరాలను పరిశీలించడంతో చిరుత సంచరించినట్లు గుర్తించారు. చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు ఉన్నట్లు కెమెరాలో రికార్డు అయ్యింది. అటవిశాఖ అధికారులకు సమాచారం అందించడంతో ఎయిర్ పోర్ట్ లోకి చేరుకున్న అటవిశాఖ అధికారులు చిరుతను బంధించేందుకు ఏర్పాటులో పడ్డారు. చిరుత కదలికలను పరిశీలించేందుకు సీసీ కెమెరాలు, బోన్ లు ఏర్పాటు చేశారు అటవీశాఖ అధికారులు. దాదాపు మూడేళ్ల క్రితం చిరుతపులి విమానాశ్రయం గోడపై నుంచి దూకిన ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. చిరుత విమానాశ్రయం గోడ దూకి గోల్కొండ, బహదూర్ గూడ వైపు వెళుతున్నట్లు కనిపించింది. కాగా.. ఇప్పుడు మరోమారు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో చిరుత సంచారం ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది.

Raghunandan Rao: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రఘునందన్ రావు కౌంటర్..

Exit mobile version