దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లా చినిగామ్‌లో భారత సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతోంది. ఇప్పటి వరకు నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ కాల్పుల్లో ఓ ఆర్మీ జవాను వీరమరణం పొందారు. సైన్యం రెండు యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్లను నిర్వహిస్తోంది. మొదటి ఆర్మీ ఆపరేషన్ ప్రారంభమైన కొద్ది గంటలకే చినిగాం గ్రామంలో మరో కాల్పుల ఘటన వెలుగులోకి వచ్చింది. ఆర్మీకి లష్కర్ గ్రూప్ గురించి ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. ఆ తర్వాత భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. రెండు వైపుల నుంచి కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సైనికులు గాయపడ్డగా..క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ.. ఓ సైనికుడు వీరమరణం పొందారు.
READ MORE: Rainy season Footcare: వర్షాకాలంలో పాదాల సంరక్షణ తప్పనిసరి..లేదంటే ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు తప్పవు..
కుల్గామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారని ఆర్మీకి సమాచారం అందింది. అనంతరం భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. దీంతో పాటు శనివారం జమ్మూ కాశ్మీర్‌లోని కతువా, ఉధంపూర్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌తో సహా ఇద్దరు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్‌ఎఫ్) జవాన్లు వీరమరణం పొందారని అధికారులు తెలిపారు. కతువా జిల్లాలోని రాజ్‌బాగ్ సమీపంలో వాహనం రోడ్డుపై నుంచి జారి ఉజ్ కాలువలో పడిపోయిందని ఆయన చెప్పారు. ఈ ప్రమాదంలో, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఏఎస్‌ఐ పర్షోతమ్ సింగ్ వీరమరణం పొందగా, అతని ఇద్దరు సహచరులు రక్షించబడ్డారు.