Site icon NTV Telugu

OnePlus Watch 2 Price: ‘వన్‌ప్లస్‌ వాచ్‌ 2’ వచ్చేసింది.. 100 గంటల బ్యాటరీ లైఫ్‌!

Oneplus Watch 2 Price

Oneplus Watch 2 Price

OnePlus Watch 2 Price and Offers: వన్‌ప్లస్ కంపెనీ తన సరికొత్త స్మార్ట్‌వాచ్ ‘వన్‌ప్లస్‌ వాచ్‌ 2’ను బార్సిలోనాలో జరిగిన మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌లో లాంచ్ అయింది. భారత్‌లో మార్చి 4 నుంచి వన్‌ప్లస్, ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లో ఈ వాచ్ విక్రయానికి అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్‌వాచ్ డ్యూయల్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడుస్తుంది. వన్‌ప్లస్‌ వాచ్‌ 2 ధర రూ.24,999గా నిర్ణయించారు. డిస్కౌంట్లు, బ్యాంకు ఆఫర్లతో కలిపి రూ.22,999కే అందుబాటులో ఉంటుంది. ఈ వాచ్ రెండు రంగుల్లో (బ్లాక్‌ స్టీల్‌, రేడియంట్‌ స్టీల్‌) వస్తుంది.

వన్‌ప్లస్‌ వాచ్‌ 2ను కేవలం ఆండ్రాయిడ్‌ ఫోన్‌తో మాత్రమే అనుసంధానం చేయొచ్చు. ఐఫోన్‌, ఆండ్రాయిడ్‌ గో-పవర్డ్‌ స్మార్ట్‌ఫోన్‌లతో ఈ వాచ్‌ను ఉపయోగించలేం. బ్యాటరీ లైఫ్‌ కోసం వన్‌ప్లస్‌ ఈ వాచ్‌లో స్నాప్‌డ్రాగన్‌ డబ్ల్యూ5 (వేర్‌ఓఎస్‌ కోసం), ఆర్‌టీఓఎస్‌ కోసం బీఈఎస్‌2700 ప్రాసెసర్లను వినియోగించింది. దీంతో స్మార్ట్‌ మోడ్‌లో 100 గంటలు, ఆర్‌టీఓఎస్‌ మోడ్‌లో 48 గంటల వరకు బ్యాటరీలైఫ్‌ ఉంటుంది. ఇక పవర్‌ సేవర్‌ మోడ్‌లో 12 రోజుల వరకు ఛార్జింగ్‌ ఉంటుంది.

Also Read: Vodafone Idea : ఆ విధంగా రూ.45,000 కోట్లను సమీకరించనున్న వొడాఫోన్ ఐడియా

వన్‌ప్లస్ వాచ్‌ 2లో ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ ఉంది. 10 నిమిషాలు ఛార్జ్‌ చేస్తే.. 24 గంటల బ్యాటరీ లైఫ్‌ వస్తుంది. పూర్తిగా ఛార్జ్‌ కావడానికి 60 నిమిషాల సమయం పడుతుంది. 466x466p రిజల్యూషన్‌తో కూడిన 1.43 అంగుళాల సర్క్యులర్‌ డిస్‌ప్లేను ఇచ్చారు. దీనికి సఫైర్‌ క్రిస్టల్‌ గ్లాస్‌ ప్రొటెక్షన్‌, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ చాసిస్‌ ఉంటుంది. 100కి పైగా వాచ్‌ ఫేస్‌లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. 100 స్పోర్ట్‌ మోడ్‌లు ఉన్నాయి. అయితే సెల్యులార్‌ కనెక్టివిటీ సదుపాయం మాత్రం లేదు.

Exit mobile version