ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!

  • వన్‌ప్లస్ ఫెస్టివ్ సేల్ అక్టోబర్ 8, 2026 అర్ధరాత్రి 12 గంటల నుంచి ప్రారంభం
  • వన్‌ప్లస్ 15, 15ఆర్, 13ఎస్ సహా పలు స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..
Oneplus Festive Sale

Oneplus Festive Sale

OnePlus Festive Sale: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్‌ (OnePlus) భారత మార్కెట్లో ఫెస్టివ్ సీజన్ సేల్‌ను తీసుకవచ్చింది. వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, ఆడియో ఉత్పత్తులపై ప్రత్యేక ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ సేల్ అక్టోబర్ 8, 2026 అర్ధరాత్రి 12 గంటల నుంచి ప్రారంభమవుతుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌తో పాటు OnePlus.in, వన్‌ప్లస్‌ స్టోర్ యాప్, మైంత్ర, బ్లింక్ఇట్ లతోపాటు ఇంకా ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్లలో ఈ ఆఫర్లు లభించనున్నాయి.

వన్‌ప్లస్ 15 సిరీస్‌

వన్‌ప్లస్ 15 సిరీస్‌ సహా పలు మోడళ్లపై ధర తగ్గింపులు ప్రకటించింది. వన్‌ప్లస్ 15 (12GB+256GB) సాధారణ ధర రూ.85,999 కాగా.. ఈ ఫెస్టివ్ సేల్‌లో రూ.84,999కే లభిస్తుంది. అంతేకాకుండా బ్యాంక్ డిస్కౌంట్‌తో దీని నెట్ ఎఫెక్టివ్ ధర రూ.81,999కు తగ్గుతుంది. ఇంకా వన్‌ప్లస్ 15R రూ.56,999కి, వన్‌ప్లస్ 13s రూ.52,999కి అందుబాటులోకి వస్తాయి. సంబంధిత బ్యాంక్ ఆఫర్లతో వీటి ధరలు రూ.54,999, రూ.49,999కు తగ్గే అవకాశం ఉంది.

నార్డ్ సిరీస్‌లోనూ

ఆఫర్ లో భాగంగా నార్డ్ సిరీస్‌లోనూ భారీ ఆఫర్లు ఉన్నాయి. వన్‌ప్లస్ నార్డ్ 6 రూ.44,999కు, నార్డ్ CE6 రూ.35,999కు, నార్డ్ CE6 లైట్ రూ.28,999కు లభించనున్నాయి. బ్యాంక్ డిస్కౌంట్ల తర్వాత వీటి నెట్ ధరలు వరుసగా రూ.42,999, రూ.33,999, రూ.27,499గా ఉంటాయి. బడ్జెట్ విభాగంలో వన్‌ప్లస్ N6 రూ.23,499 నుంచి, N6x రూ.18,999 నుంచి, N6 Lite రూ.15,999 నుంచి లభించనున్నాయి. బ్యాంక్ ఆఫర్లను కలుపుకుంటే N6 Lite ధర రూ.14,999కు తగ్గుతుంది.

ఉచిత స్టైలస్‌

ట్యాబ్లెట్ విభాగంలో వన్‌ప్లస్ ప్యాడ్ 4పై ప్రత్యేక బండిల్ ఆఫర్ ప్రకటించింది. రూ.62,999 విలువైన ఈ ట్యాబ్లెట్‌కు ఫెస్టివ్ సేల్ సమయంలో ఉచిత స్టైలో ప్రో లభిస్తుంది. బ్యాంక్ డిస్కౌంట్ తర్వాత దీని నెట్ ఎఫెక్టివ్ ధర రూ.58,499గా ఉంటుంది. వన్‌ప్లస్ ప్యాడ్ గో2 రూ.29,999కే లభించడంతో పాటు ఉచిత గో2 స్టైలో అందిస్తుంది. వన్‌ప్లస్ ప్యాడ్ లైట్ ధర రూ.22,999కు తగ్గనుంది.

బడ్స్, వైర్‌లెస్ ఆడియోపై డిస్కౌంట్లు

ఆడియో ఉత్పత్తులపై కూడా వన్‌ప్లస్ ఆకర్షణీయమైన ధరలను ప్రకటించింది. వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3 రూ.10,999కు, బడ్స్ 4 రూ.5,899కు, నార్డ్ బడ్స్ 4 ప్రో రూ.3,899కు, నార్డ్ బడ్స్ 4 రూ.2,899కు లభించనున్నాయి. బ్యాంక్ ఆఫర్ల తర్వాత బడ్స్ ప్రో 3 ధర రూ.8,999కు, బడ్స్ 4 ధర రూ.5,399కు తగ్గుతుంది. బులెట్స్ వైర్‌లెస్ Z3 రూ.1,599కే లభించనుండగా.. బ్యాంక్ డిస్కౌంట్ తర్వాత రూ.1,399కే కొనుగోలు చేసే అవకాశం ఉంది.

N6xకు కొత్త వేరియంట్..

వన్‌ప్లస్ N సిరీస్‌లో N6లో 8,000mAh బ్యాటరీ, 45W ఛార్జింగ్ సపోర్ట్ ఉండగా, N6xలో 7,000mAh బ్యాటరీ ఉంది. అక్టోబర్ 8 నుంచే N6xకు కొత్త 6GB+128GB వేరియంట్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ సిరీస్‌లో 3 నెలల వరకు నో-కాస్ట్ EMI సదుపాయం ఉంటుంది.

ఆఫ్‌లైన్‌లోనూ లభ్యం

నార్డ్ బడ్స్ 3rకు ‘జేడ్ మిస్ట్’ అనే కొత్త కలర్ వేరియంట్‌ను వన్‌ప్లస్ పరిచయం చేస్తోంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్లతో పాటు రిలయన్స్ డిజిటల్, క్రోమా, విజయ్ సేల్స్ వంటి రిటైల్ స్టోర్లలోనూ ఈ ఫెస్టివ్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. అమెజాన్‌లో ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులపై, ఫ్లిప్‌కార్ట్‌లో ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ కార్డులపై అదనపు డిస్కౌంట్లు వర్తిస్తాయి.