NTV Telugu Site icon

Oneplus12 Offer: త్వరపడండి.. వన్‌ప్లస్ 12పై భారీ తగ్గంపు

Oneplus 12

Oneplus 12

Oneplus12 Offer: వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ ప్రేమికులందరికీ ఒక మంచి వార్త. వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ప్రత్యేక తగ్గింపులతో లభిస్తోంది. వన్‌ప్లస్ 13 సిరీస్ భారతదేశంలో లాంచ్ కానున్న సందర్భంగా, వన్‌ప్లస్ 12పై ప్రత్యేక ఆఫర్లు వెలుబడ్డాయి. హై-ఎండ్ ఫీచర్లు, అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో ఉన్న ఈ ఫోన్‌ను ఇప్పుడు తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ 12ను రూ.59,899 లకే కొనుగోలు చేసే అవకాశం వచ్చింది. ఇది అసలు ధర కంటే రూ.5,100 తక్కువ. అంతేకాదండోయ్.. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా మరో 5% డిస్కౌంట్ ను పొందవచ్చు. అంటే, ఈ ఫోన్‌ను రూ.56,904కే పొందవచ్చు. అలాగే ఏదైనా పాత ఫోన్ ఎక్స్చేంజ్ ద్వారా మరింత తగ్గింపును కూడా అందుకోవచ్చు. అలాగే, ఇక ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా ఈ మొబైల్ ను సొంతం చేసుకోవచ్చు.

Also Read: Maruti Suzuki: భారీ ఆఫర్ ప్రకటించిన మారుతీ.. కారుపై ఏకంగా రూ.2.15 లక్షల వరకు డిస్కౌంట్

ఇక వన్‌ప్లస్ 12 ఫీచర్ల విషయానికి వస్తే.. వన్‌ప్లస్ 12 గ్లేసియల్ వైట్, ఫ్లోయి ఎమరాల్డ్, సిల్కీ బ్లాక్ అనే మూడు స్టైలిష్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ఫోన్‌లో 6.82-అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లే కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+, డాల్బీ విజన్ వంటి అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. స్క్రీన్ 1440 x 3168 పిక్సెల్స్ రిజల్యూషన్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఇక ఈ ఫోన్ లో వన్‌ప్లస్ 12 శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 16GB RAM, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉండడంతో గేమింగ్, మల్టీటాస్కింగ్‌ను అత్యుత్తమంగా నిర్వహించగలదు. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆక్సిజన్ OS 14తో వస్తుంది.

Also Read: Chinese Manjha: యువకుడి ప్రాణం తీసిన చైనీస్ మాంజా.. గొంతు కోయడంతో మృతి..

ఇక ఇందులో బ్యాటరీ, ఛార్జింగ్ విషయానికి వస్తే.. 5,400mAh బ్యాటరీతో 100W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్, 10W రివర్స్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇక మొబైల్ కెమెరా విషయానికి వస్తే.. మొబైల్ వెనుకవైపు మూడు కెమెరాలు వస్తాయి. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 64MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 48MP అల్ట్రావైడ్ లెన్స్ కెమెరాలను పొందవచ్చు. అలాగే ముందువైపు 32MP సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంది. ఫోటోగ్రఫీని ప్రేమించే వారికి ఈ మొబైల్ బెస్ట్ ఛాయిస్. మొత్తానికి హై-ఎండ్ ఫీచర్లు, శక్తివంతమైన ప్రాసెసర్, అద్భుతమైన కెమెరా సామర్థ్యాలను తక్కువ ధరలో పొందాలనుకుంటే, వన్‌ప్లస్ 12 మీకో సూపర్ ఛాయిస్. ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న ఈ ఆఫర్‌ను కోల్పోకండి.

Show comments