Site icon NTV Telugu

Jammu Kashmir: ఉరిలో పాకిస్తాన్ కాల్పులు.. మహిళ మృతి, మరొకరికి గాయాలు..!

Jammu Kashmir

Jammu Kashmir

Jammu Kashmir: ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని ఉరి ప్రాంతంలో పాకిస్తాన్ సరిహద్దు షెల్లింగ్‌లో గురువారం ఒక మహిళ మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. ఈ సంఘటన గురువారం జరిగింది. ఇక అధికారుల ప్రకారం, రేజర్వానీ నుంచి బారాముల్లా వెళ్ళిన ఒక వాహనం మొహురా సమీపంలో శెల్లింగ్ దాడికి గురైంది. ఈ దాడిలో బశీర్ ఖాన్ భార్య నాగ్రిస్ బేగం అనే మహిళ ప్రాణాలు కోల్పోయారు. అలాగే రాజీక్ అహ్మద్ ఖాన్ భార్య మహిళ హఫీజా గాయాలపాలు కావడంతో వెంటనే జీఎంసీ బారాముల్లాకు తరలించినట్లు పేర్కొన్నారు.

Read Also: X Blocks Accounts: భారత్‌లో 8,000కు పైగా ఖాతాలను బ్లాక్ చేసిన X.. ప్రభుత్వ ఆదేశాలపై స్పందన.!

గత కొన్ని రోజులుగా ఉత్తర కాశ్మీర్‌లోని ఉరి మరియు కుప్వారా ప్రాంతాలలోని సరిహద్దు ప్రాంతాలపై పాకిస్తాన్ నిరంతరం షెల్లింగ్ చేస్తోంది. గురువారం రాత్రి పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్, పంజాబ్ ఇంకా రాజస్థాన్ లోని సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులతో పాటు డ్రోన్లతో కాల్పులు జరిపింది. అంతే కాకుండా తీవ్ర ఘర్షణల నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యం జమ్మూ, పంజాబ్‌లోని పఠాన్‌కోట్ అలాగే రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లలో కాల్పులు జరిపింది.

Read Also: Samba : సాంబా సెక్టార్‌లో ఉగ్ర కుట్ర.. 10 మంది జైషే మహమ్మద్ ఉగ్రవాదులు హతం

అయితే, అన్ని డ్రోన్లతో పాటు క్షిపణులను భారత వైమానిక రక్షణ వ్యవస్థలు నాశనం చేసాయి. అలాగే జైసల్మేర్‌లో పాకిస్తాన్ డ్రోన్‌ లను భారత వైమానిక రక్షణ కూడా అడ్డుకుంది.ఏప్రిల్ 22న పహల్గామ్ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయినందుకు ప్రతీకారంగా భారతదేశం పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ప్రదేశాలలో ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్న ఒక రోజు తర్వాత ఇది జరిగింది. 15 భారతీయ నగరాలను లక్ష్యంగా చేసుకునేందుకు పాకిస్తాన్ చేసిన ప్రయత్నాన్ని భారతదేశం భగ్నం చేసిన సంగతి తెలిసిందే.

Exit mobile version