ఓయూ పరిధిలో జూన్ 12 నుంచి వివిధ పీజీ కోర్సుల పూర్వ విద్యార్థుల వన్ టైం ఛాన్స్ బ్యాక్ లాగ్ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వివిధ కాలేజీల్లో 2000-2017 బ్యాచ్లలో పీజీ కోర్సులు తప్పినా, ఫీజు చెల్లించిన పూర్వ విద్యార్థులు పరీక్షకు హాజరు కావచ్చు అని, పూర్తి వివరాలు ఉస్మానియా వెబ్ సైట్లో చూడవచ్చని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. వేసవి సెలవుల కారణంగా ఆదివారం నుంచి ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లోని వివిధ పీజీ హాస్టళ్లు, మెల్లను మూసివేయనున్నట్లు చీఫ్ వార్డెన్ ప్రొఫెసర్ శ్రీనివాస్ రావు తెలిపారు. తిరిగి వచ్చే నెల 5న పునఃప్రారంభించనున్ననట్లు తెలిపారు. విద్యార్థులు గమనించి సహకరించాలని శ్రీనివాస్ రావు కోరారు.
Also Read : Karnataka Election Results: బీజేపీని దెబ్బకొట్టిన లింగాయత్‌లు.. చివరి నిమిషంలో కమలం పాచిక పారలేదు..
అయితే.. ఇటీవల సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తో ఉస్మానియా యూనివర్సిటీ పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా ఓయూ ఇంజినీరింగ్ కాలేజ్ మైనింగ్ విభాగంలో సింగరేణి కాలరీస్ కంపెనీ చైర్ ఏర్పాటు చేసింది. ఫలితంగా సౌలతులు, అధ్యాపకుల కొరతను తీర్చేందుకు అవసరమైన ఫండ్స్ సమకూరనున్నాయి. ఎంవోయూలో భాగంగా సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ రూ. 3 కోట్ల గ్రాంట్ ను ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ కు అందించారు. దీంతోపాటు సింగరేణితో కలిసి ఓయూ మరో నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో మొదటి సారిగా మైనింగ్ ఇంజినీరింగ్ విభాగంలో పనిచేసేందుకు ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ కింద ఇద్దరు సింగరేణి ఉద్యోగులకు ఉత్తర్వులు ఇచ్చింది. దేశంలోనే ఇది మొదటిసారి అని ఒప్పందంలో పేర్కొంది.
Also Read : BJP: బీజేపీకి గెలుపోటములు కొత్త కాదన్న యెడ్డీ… లోక్‌సభ ఎన్నికల్లో పుంజుకుంటామన్న బొమ్మై
