హైదరాబాద్‌లో రియల్ రంగానికి అనుకూల వాతావరణం ఉండడంతో అన్ని తరగతుల వారు నగరాన్ని స్వర్గధామంగా భావిస్తున్నారు. దీంతో ఈ మహా నగరం స్థిరాస్తుల విక్రయాల్లో దూసుకుపోతోంది. ఇప్పుడు ఈ విశ్వనగరం ఆకాశహర్మ్యాలతో నగరం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. భారీగా రిజిస్ట్రేషన్లు నమోదవుతున్నాయి. తాజాగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ఇళ్ల విక్రయాల్లో 29 శాతం వార్షిక వృద్ధి నమోదైంది.
READ MORE: IAS officers Transferred: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. ఈ సారి ఎంతమందంటే..
2019 నుంచి 2024 వరకు సీఏజీఆర్ గణాంకాలను క్రెడాయ్ హైదరాబాద్, సీఆర్‌ఈ మ్యాట్రిక్స్ రూపొందించిన నివేదికలో ఈ విషయాన్ని తెలిపింది. ఐదేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పటి మార్కెట్ పరిస్థితి భారీగా పుంజుకుంది. 2019 ప్రథమార్ధంతో పోలిస్తే 2024లో విక్రయాల్లో 148 శాతం వృద్ధి నమోదైంది. రూ.5 కోట్ల కంటే ఎక్కువ విలువ కల్గిన స్థిరాస్తుల విక్రయాల్లో ఏకంగా 760 శాతం వృద్ధి సాధించింది. అమ్మకానికి లక్షకుపైగా ఇళ్లు ఉన్నాయని నివేదిక తెలిపింది. నిర్మాణ రంగంలో ఐదేళ్లలో చాలా మార్పులు వచ్చాయి. ఐదేళ్ల క్రితం విక్రయించిన ఇళ్ల విలువ రూ.34,044 కోట్లు ఉంటే.. గతేడాది రూ.1,15,759 కోట్లకు చేరింది.
READ MORE:Children’s Memory: పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే అద్భుత చిట్కాలు..
2019 నుంచి 2024 వరకు అమ్మకాల జాబితా….
2019లో 30,316 ఇళ్లను విక్రయించారు. వాటి విలువ రూ.34,044 కోట్లు.
2020లో కొవిడ్ కష్టకాలంలో విక్రయాలు తగ్గాయి. 29,611 మాత్రమే విక్రయించారు. విలువ రూ.33,084 కోట్లుగా లెక్కకట్టారు.
2021లో మార్కెట్ పుంజుకుంది. అమ్మకాలు 50,884కి పెరిగాయి. రూ.58,818కు వీటి విలువ.
2022లో 67,276 ఇళ్ల కొనుగోళ్లు జరిగాయి. రూ.92,359 ఎగబాకింది. ఈఏడాది ధరలు భారీగా పెరిగాయి.
2023లో స్థిరాస్తుల విక్రయాలు విలువ తొలిసారి లక్ష కోట్లను దాటింది. రూ.1,15,759గా విలువ కట్టారు. 74,991 యూనిట్లు అమ్మారు.
2024: ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే 38,660 యూనిట్లు అమ్ముడయ్యాయి. వీటి విలువ రూ. 58,841 కోట్లుగా క్రెడాయ్ పేర్కొంది.
READ MORE:Rashmika Mandanna: వయనాడ్ బాధితులకు రష్మిక సాయంపై ట్రోలింగ్?
కాగా..గత అయిదేళ్లుగా హైదరాబాద్ మహానగరంలో ఇళ్ల ధరలు భారీగా పెరిగాయి. దీంతో స్థిరాస్తుల ప్రాథమిక విక్రయాల విలువ క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2019లో వాటి విలువ రూ.34,044 కోట్లు ఉంటే..ఈ ఏడాది ఆరు నెలల్లోనే రూ. 58,841 కోట్లు క్రాస్ అయ్యిందని క్రెడాయ్ తన నివేదికలో పేర్కొంది. ఇళ్ల అమ్మకాలు కూడా పెరిగాయి. ఇదిలా ఉండగా.. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించే విషయంలో బిల్డర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సిటీలో అమ్ముడుపోని ఇళ్ల యూనిట్లు 1,03,316 ఉన్నాయి.దీంతో కొత్త ప్రాజెక్టుల ప్రారంభాలపై బిల్డర్లు వెనక్కి తగ్గారు.