Site icon NTV Telugu

Vadla Deepika : ఆర్జీయూకేటీ విద్యార్థిని మృతి పట్ల సంతాపం.. లక్ష రూపాయల ఎక్స్‌గ్రేషియా

Vadla Deepika

Vadla Deepika

ఆర్జీయూకేటీ బాసరలో పీయూసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న వడ్ల దీపిక మృతిపై వర్సిటీ పరిపాలన భవనంలో గల కాన్ఫరెన్స్ హాల్ నందు ఏర్పాటుచేసిన సంతాప సభలో వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ, డైరెక్టర్ ప్రొపెసర్ సతీష్ కుమార్, అధ్యాపకులు పాల్గొన్నారు. వైస్ ఛాన్స్లర్ తో సహా డైరెక్టర్, అధ్యాపకులు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ మాట్లాడుతూ ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థిని అకాల మృతి చెందడం బాధాకరమన్నారు. ఇది దురదృష్టకరమైన సంఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని, విద్యార్థి కుటుంబానికి వర్సిటీ తరఫున ప్రగాఢ సంతాపం తెలిపారు. మృతి చెందిన విద్యార్థిని కుటుంబానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆమోదంతో వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ వెంకటరమణ లక్ష రూపాయల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించి, కుటుంబ సభ్యులకు చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో విభాగ అధిపతులు, అసోసియేట్ డిన్స్, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.

 

Also Read : Adipurush: తెలివిగా సైడైన ప్రభాస్.. రికార్డులు చెరిపేస్తున్న ఆదిపురుష్!

వీసీకి వినతి పత్రం అందజేసిన టీడబ్ల్యూజేఎఫ్‌ జర్నలిస్ట్ సంఘం

విద్యార్థిని కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) నాయకులు వీసీని హైదరాబాదులో కలిసి విఙ్ఞప్తి చేశారు. వడ్ల దీపిక తండ్రి వీరన్న జర్నలిస్ట్ కావడంతో జర్నలిస్టు కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. జర్నలిస్టుల సంఘం వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ వెంకటరమణ గారిని కలిసి వినతి పత్రం అందజేశారు. స్పందించిన వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ వెంకటరమణ గారు యూనివర్సిటీ తరపున లక్ష రూపాయలు ఎక్స్గ్రేషియా ఇప్పటికే ఇచ్చామని, మీ వినతి మేరకు ప్రభుత్వ దృష్టికి విషయాన్ని తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

Also Read : Nandamuri Bhargav Ram : హ్యాపీ బర్త్ డే చిన్నోడా.. తండ్రి అంతటోడివి కావాలే

Exit mobile version