NTV Telugu Site icon

Gujrat: అద్దెకు ఇళ్లు తీసుకున్న ఒక అమ్మాయి.. ముగ్గురు అబ్బాయిలు.. కట్ చేస్తే షాక్

Gana

Gana

సాధారణంగా ఇంటిని అద్దెకు ఇచ్చేటప్పుడు ఓనర్లు చాలా ఆలోచిస్తూ ఉంటారు. ఎక్కువగా ఫ్యామిలీస్ కే ఇంటిని అద్దెకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు. రెంట్ కు ఇచ్చేటప్పుడు కనీసం వారికి సంబంధించిన కొన్ని వివరాలు అయినా తెలుసుకుంటారు. వారి ఆధార్ కార్డ్ లాంటి ఐడీ ప్రూఫ్ లు తీసుకుంటారు. అయితే కొంత మంది ఓనర్లు ఇంటిని అద్దెకు ఇచ్చిన తరువాత వారు ఏం చేస్తున్నారో కూడా పట్టించుకోరు. నెలకు అద్దె కడుతున్నారా లేదా అనేది మాత్రమే చూసుకుంటారు. అలాగే చూసుకున్న యజమాని అద్దెకు వచ్చిన కొంతమంది కారణంగా చిక్కులో పడ్డారు.

Also Read: New Business Idea: వాడిపోయిన పూలతో బిజినెస్.. కోట్లలో సంపాదన

వివరాల్లోకి వెళ్తే గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లోని సర్కేజీ ప్రాంతంలో ఓ అమ్మాయి ముగ్గురు అబ్బాయిలతో కలిసి ఇంటిని అద్దెకు తీసుకుంది. రెంటుకు తీసుకునేటప్పడు వారు ఏం చెప్పారో  ఏమో కానీ బ్యాచిలర్స్ అయినా ఆ ఇంటి ఓనర్ వారికి ఇళ్లు అద్దెకు ఇచ్చారు. అయితే అక్కడ వారు గంజాయి పండించడం స్టార్ చేశారు. అయితే నేల మీద పండే గంజాయిని ఆర్టిఫిషియల్ గా పండించడం కోసం వారు కరెంట్ ను ఉపయోగించి రూమ్ టెంపరేచర్ వద్దే గంజాయి సాగుకు కావాల్సిన వాతావరణాన్ని క్రియేట్ చేశారు. దీని కోసం నెలకు రూ. 35 వేల రూపాయలు చెల్లిస్తూ రెండు ప్లాట్లను కూడా అద్దెకు తీసుకున్నారు. ఒక్కో ప్లాట్ లో వంద మొక్కలను పెంచడం మొదలు పెట్టారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటిని సోదా చేసి వారు గంజాయి సాగు చేసే విధానం చూసి ఆశ్చర్యపోయారు. వారిలో ప్రధాన నిందితుడు పారిపోగా ఒక అమ్మాయితో పాటు ఇద్దరు అబ్బాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటి యజమానిని కూడా దీనికి సంబంధించి విచారిస్తున్నారు పోలీసులు. దీన్ని బట్టి చూస్తే ఇంటిని అద్దెకు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండటం ఎంత అవసరమో అర్థం అవుతుంది.

 

Show comments