Site icon NTV Telugu

Canada Open 2023 : ఒకరు ఓటమి.. మరొకరు ఫైన‌ల్‌కు..!

Canada Open

Canada Open

కెనడా ఓపెన్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ లక్ష్య సేన్ ఫైనల్ కు చేరుకున్నాడు. జపాన్‌కు చెందిన కెంటా నిషిమోటోపై వరుస గేమ్‌లతో విజయం సాధించి ఈ ఘనత సాధించాడు. లక్ష్య సేన్ 11వ ర్యాంక్ కెంటా నిషిమోటోను 21-17, 21-14 తేడాతో ఓడించాడు. లక్ష్య సేన్ ఫైనల్‌లో చైనాకు చెందిన లి షి ఫెంగ్‌తో తలపడనున్నాడు. వీరిరువురికి 4-2 హెడ్-టు-హెడ్ రికార్డు ఉంది.

Minister Roja: చంద్రబాబూ.. విజన్ సరే, ఏపీకి ఏం చేశావ్?

అయితే సీజన్ ప్రారంభంలో లక్ష్య సేన్ సరైన ఫామ్‌లో లేక‌ ర్యాంకింగ్స్‌లో 19వ స్థానానికి పడిపోయాడు. 2021 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో లక్ష్యసేన్.. కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. మరోవైపు ప్రపంచ నం.1 క్రీడాకారిణి అకానె యమగుచి సెమీఫైనల్లో పీవీ సింధును ఓడించింది. మహిళల సింగిల్స్ సెమీ-ఫైనల్స్‌లో జపాన్ నంబర్ వన్ అకానె యమగుచి చేతిలో 14-21, 15-21 తేడాతో రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఓడిపోయింది. సింధుపై యమగూచి 11వ విజయాన్ని నమోదు చేసింది. గ‌తంలో యమగూచిపై భారత షట్లర్ పీవీ సింధు 14 మ్యాచ్‌లు గెలిచిన రికార్డ్ ఉంది.

Health Tips : ఈ స్మూతీని రోజూ తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలో..

2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ తర్వాత సింధు గాయపడగా.. త‌ర్వాత కోలుకుని బ్యాడ్మింటన్ కోర్టులో అడుగుపెట్టింది. ఆ తర్వాత 2022 కామన్వెల్త్ గేమ్స్ నుండి తొమ్మిది టోర్నమెంట్లు ఆడిన సింధూ.. ఐదు టోర్నమెంట్లలో మొదటి రౌండ్లోనే ఓడిపోయి వెళ్లిపోవాల్సి వచ్చింది. సింధు ఈ ఏడాది మొత్తం 26 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 14 మ్యాచ్‌ల‌లో గెలుపొందగా.. 12 మ్యాచ్‌ల‌లో ఓడిపోయింది. అయితే ఈ ఏడాది తొలి టైటిల్ కోసం ఎదురుచూస్తున్న సింధు.. గాయం నుంచి కోలుకున్నాక‌ ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతోంది.

Exit mobile version