NTV Telugu Site icon

Pawan Kalyan: కూటమి అధికారంలోకి రాగానే ప్రాజెక్టులు పూర్తి చేస్తాం

Pawan Kalyan

Pawan Kalyan

వైసీపీని అందలం ఎక్కిస్తే మన భవిష్యత్తును చంపేస్తారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ.. తనకు గిద్దలూరులో ఉన్న బలం ఉందన్నారు. తెలుగుదేశం అభ్యర్థికి మద్ధతు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ రాష్ర్ట భవిష్యత్ కోసం త్యాగం చేశానని.. కూటమి ప్రభుత్వం రాగానే తెలుగు గంగ, గుండ్లమోటు ప్రాజెక్టులను ఏకం చేస్తామన్నారు. గిద్దలూరులో తాగునీటి సమస్య లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. జగన్ వెలుగొండ ప్రాజెక్టు పూర్తికాకపోయినా సొరంగాలు తవ్వి ప్రాజెక్ట్ ప్రారంభించారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రాగనే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి రైతాంగానికి సాగు, తాగు నీళ్ళు అందిస్తామని హామీ ఇచ్చారు. శ్రీకృష్ణ దేవరాయులు తవ్విన కంభం చెరువుని టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు.

READ MORE: Palestine protest: ఆంక్షలు ఎదుర్కొంటున్న అమెరికా విద్యార్థులకు హౌతీ ఉగ్రవాదుల బిగ్ ఆఫర్….

వైసీపీ ప్రభుత్వం కంభం చెరువుని గాలికి వదిలేసిందని పవన్ కల్యాణ్‌ అన్నారు. గిద్దలూరు సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లాలో పెరిగిన వాడిని, ఇక్కడ కష్టాలు తెలుసు.. ఒంగోలు, కనిగిరిలో పెరిగానని తెలిపారు. నేను రైతు పక్షపాతిని.. గిద్దలూరు అభివృద్ధికి తోడ్పడతానన్నారు. ప్రభుత్వ కల్తీమద్యం తాగి ఎన్నో పేగులు తేగిపొయాయని.. ఎంతో మంది మరణాలకు కారణం అయిందని ఆరోపించారు. ఆత్మగౌరవం లేక పోవడంతో వైసీపీ నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూటమి పార్టీలోకి వచ్చారని స్పష్టం చేశారు. జగన్ ఓటు విధేయతతో అగడంలేదని.. రౌడీయిజంతో ఓటు అడుగుతున్నారన్నారు. జగన్ ఇంటికి పంపించాలని.. ప్రజలు జగన్ కు వెన్నులో నుంచి భయం తెపించాలని వ్యాఖ్యానించారు.