దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ ( శనివారం ) సాయంత్రం ఆరు గంటల తర్వాత మరోసారి భారీగా వర్షం కురుస్తోంది. గత నాలుగు రోజుల విరామం తర్వాత ఈరోజు వానా పడుతుంది. ఇప్పుడిప్పుడే ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జనం ప్రయత్నిస్తున్నారు. దీంతో వర్షం గట్టిగానే దంచి కొడుతుంది. ఈ పరిస్థితితో ఇప్పటికే వరద గుప్పిట్లో ఉన్న హస్తిన.. కోలుకునేందుకు ఇంకాస్త టైమ్ పడేలా కనబడుతుంది.
Read Also: Video Viral: విమానంలో విరాళం సేకరిస్తున్న పాకిస్థానీ.. మదర్సాలు నిర్మాణం కోసమేనట..!
ఎడతెరిపి లేకుండా కురుస్తున్నా.. భారీ వర్షాలు.. పైగా యమునా నదీకి ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరడంతో దేశ రాజధాని ప్రాంతం నీట మునిగింది. ఈ క్రమంలో ఓవైపు వర్షం ఆగిపోయినప్పటికీ.. అప్పటికే పోటెత్తిన వరదతో యమునా నదిని డేంజర్ జోన్‌కి చేరుకుంది. దీంతో యమున నదీ తీర ప్రాంతం నుంచి జనాల్ని సురక్షిత ప్రాంతాలకు ఢిల్లీ ప్రభుత్వం తరలించింది. ఈలోపు నగరం కూడా నీట మునిగి.. మొత్తం జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపించింది.
ఇక సహాయక చర్యల్లో భాగంగా రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్ టీమ్స్ నడుం లోతు వరద నీటి నుంచి జనాలను, మూగ జీవాల్ని తరలించింది. దీంతో ఈలోపు వరద క్రమంగా తగ్గుముఖం పట్టింది. యమునా నదీ ఐదు సెంటీమీటర్ల ప్రవాహం తగ్గడంతో పరిస్థితి సాధారణంగా మారుతుందని అందరు ఆశించారు. కానీ, తాజాగా మళ్లీ వర్షం కురుస్తుండడంతో మళ్లీ నగర వాసుల్లో ఆందోళన కొనసాగుతుంది. చాలావరకు వీధుల్లో ఇప్పటికీ మురుగునీరు అలాగే నిలిచిపోవడం గమనార్హం. మరోవైపు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
