తిరుమల తిరుపతి కొండపై కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించేందుకు రోజు రోజుకు భక్తుల రద్దీ పెరగిపోతోంది. అయితే.. స్వామి వారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా.. దేశ విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. అయితే.. ఆగమశాస్త్రం నిబంధనల ప్రకారం.. కొండపై నో ఫ్లై జోన్‌గా ఉన్నప్పటికీ.. అధికారికంగా మాత్రం కేంద్రం ప్రభుత్వం తిరుమలను నోఫ్లైజోన్‌గా ప్రకటించకలేదు.
Also Read : Byju’s Layoff: 1000 మంది ఉద్యోగులకు గుడ్ బై చెప్పనున్న బైజూస్
అయితే.. ఇప్పుడు మరోసారి తిరుమలపై మళ్లీ విమానం ఎగిరింది. అన్నదానం సముదాయం మీదుగా విమానం వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఆగమశాస్ర్తం నిభందనల మేరకు తిరుమలను నో ప్లై జోన్ గా ప్రకటించాలని గతంలోనే టీటీడీ కేంద్రాన్ని కోరింది. అయితే.. నో ప్లై జోన్ గా ప్రకటించని కేంద్రం.. మౌఖిక ఆదేశాలతో తిరుమలపై నుంచి విమానాలు వెళ్ళకుండా జాగ్రత్త వహిస్తామని ఎయిర్ పోర్ట్ అధికారులు ప్రకటించారు. కానీ తరుచుగా తిరుమలపై నుంచి విమానాలు ప్రయాణిస్తూండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read : Sharad Pawar: శరద్ పవార్, సుప్రియా సూలేలను చంపేస్తాం.. ట్విట్టర్లో హత్య బెదిరింపులు