Challa Family Dispute: నంద్యాల జిల్లా అవుకులో దివంగత చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబంలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి.. చల్లా కుటుంబంలో ఎప్పటి నుంచో ఈ విభేదాలు కొనసాగుతూ రాగా.. ఈ సారి, ఘర్షణ, పరస్పరం దాడి వరకు వెళ్లింది వ్యవహారం.. దివంగత ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి సతీమణి చల్లా శ్రీలక్ష్మి, ఇతర కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ జరిగినట్టుగా చెబుతున్నారు. ఇంటి దగ్గర కారు పార్కింగ్ విషయంలో, పిల్లల విషయంలో ఈ సారి ఘర్షణ తలెత్తినట్టుగా తెలుస్తోంది.. దీంతో, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారట చల్లా కుటుంబ సభ్యులు.. ఈ ఘర్షణతో గాయాలు కూడా అయ్యాయి.. దీంతో.. బనగానపల్లి ఆసుపత్రిలో చల్లా శ్రీలక్ష్మి, అవుకు ఆసుపత్రిలో చల్లా శ్రీదేవి చేరారు.. ఏడాదిగా ఆస్తుల వివాదంలో తరచూ వీధికెక్కుతూ వస్తున్నారు చల్లా కుటుంబ సభ్యులు..
Read Also: CM YS Jagan Kadapa Tour: రెండో రోజు కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన..
కాగా, దివంగత మాజీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి ఫ్యామిలీలో ఆయన మృతి తర్వాత విభేదాలు నెలకొన్నాయి. అవి కాస్తా చల్లా కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఫొటో ఫ్రేమ్ కోసం మొదలైన గొడవ పెద్ద గాలివానలా మారిందని.. ఆ తర్వాత ఆస్తి, రాజకీయ వారసత్వం ఇలా కొత్త విషయాలు తెరపైకి వచ్చాయనే చర్చలు జరిగాయి. అత్తా కోడల మధ్య గొడవలోకి ఆడపడుచు ఎంట్రీ అవ్వడంతో కథ మరో మలుపు తిరిగిందని చెబుతారు. అయితే, చల్లా రామకృష్ణారెడ్డి రాయలసీమ సీమ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు.. కానీ, చల్లా రామకృష్ణారెడ్డి 2021 జనవరిలో అనారోగ్యంతో కన్నుమూశారు.. ఎమ్మెల్సీ పదవిలో ఉండగానే ఆయన మృతిచెందడంతో ఆయన తర్వాత ఎమ్మెల్సీ పదవిని చల్లా రామకృష్ణారెడ్డి చిన్న కుమారుడు చల్లా భగీరథరెడ్డికి ఇచ్చారు సీఎం వైఎస్ జగన్.. అయితే, ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి కూడా 2022 నవంబర్‌లో మరణించారు. అప్పటి నుంచి ఆ ఫ్యామిలీలో విభేదాలు స్టార్ట్ అయ్యాయి.. చల్లా కుటుంబం రెండుగా చీలిపోయింది.. అప్పటి నుంచి ఆ ఫ్యామిలీలో తరచూ ఏదో వివాదం నడుస్తూనే ఉంది. ఇప్పుడు పరస్పరం దాడి వరకు వెళ్లింది.