Site icon NTV Telugu

Bandi Sanjay : కేంద్రం డబ్బులు వాడుకొని తెలంగాణ ప్రజలను కేసీఆర్‌ మోసం చేస్తున్నారు

Bandi Sanjay

Bandi Sanjay

అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ళు కేటాయించాలంటూ కూకట్‌పల్లి మూసాపేటలో బీజేపీ నాయకుల 24 గంటల ఆత్మగౌరవ దీక్ష చేపట్టారు. అయితే.. ఈ ఆత్మగౌరవ దీక్షకు ముఖ్య అతిథిగా హాజరై సంఘీభావం తెలిపారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆవాస్ యోజన పథకం కింద వచ్చిన డబ్బులు వాడుకొని డబల్ బెడ్ రూమ్ లు నిర్మించకుండా తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు.. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ వైఫల్యాలను, మోసాలను లేవనెత్తుతున్నారనే భయంతో బీజేపీ నాయకుల పై కేసులు పెడుతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా బీజేపీ నాయకులను అడ్డుకోలేరని, భయపెట్టలేరని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

Also Read : Naga Shaurya: ‘రంగబలి’ రిలీజ్ డేట్ లాక్ చేశారుగా!

ధర్మం కోసం బీజేపీ నాయకులు నిరంతరం ప్రజల తరఫున పోరాటం చేస్తూ ఉంటారని బండి సంజయ్ గుర్తు చేశారు. డబల్ బెడ్ రూమ్ ల విషయమై ఎన్నిసార్లు కేంద్రం జాబితా ఇవ్వాలని కోరిన కేసీఆర్ ఇవ్వకుండా జాప్యం చేస్తూ.. నిరుపేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారన్నారు బండి సంజయ్. కేంద్రం నిధులతో డబల్ బెడ్రూంలు నిర్మించి ఉంటే ధైర్యంగా జాబితాను కేంద్రానికి ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాబోవు రోజుల్లో తెలంగాణలో ప్రజలు ఓటు బ్యాంకుతో కేసీఆర్‌కు బుద్ధి చెబుతారని ఆయన అన్నారు..ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Also Read : CM YS Jagan: పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సీఎం జగన్‌ సమీక్ష..

Exit mobile version