NTV Telugu Site icon

AP High Court: ఐపీఎస్ అధికారి ఏబీ పిటిషన్ పై హైకోర్టులో 2గంటలుగా కొనసాగుతున్న విచారణ

Ap High Court

Ap High Court

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ సస్పెన్షన్ పై క్యాట్ ఉత్తర్వులు సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ జరిగింది. రెండోసారి ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేయటం సరికాదని ఈ నెల8 న క్యాట్ తీర్పు ఇచ్చింది. క్యాట్ ఆదేశాలను ప్రభుత్వం అప్పీల్ చేసింది. వెకేషన్ బెంచ్ లో సుదీర్ఘ వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ శ్రీరామ్.. క్యాట్ ఉత్తర్వులు చట్ట విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఏబీ సస్పెన్షన్ కు తగిన కారణాలు ఉన్నాయని, క్యాట్ వాటిని గురించలేదని ప్రభుత్వం పేర్కొంది. ఏబీపై నమోదు చేసిన కేసులో చార్జీ షీట్ ఇప్పటికే దాఖలు చేశామని తెలిపింది. ఒకే విషయంపై రెండు సార్లు సస్పెండ్ చేశారని ఏబీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. రెండుసార్లు సస్పెన్షన్ చేయటంతో క్యాట్ సప్సెన్షన్ ఎత్తివేసి పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినా పోస్టింగ్ ఇవ్వలేదన్న వివరించారు. ఏజీ శ్రీరామ్ పలు జడ్జిమెంట్లు ఉదాహరించారు. వాదనలు ప్రతివాదనలు 2 గంటలుగా కొనసాగుతున్నాయి.

READ MORE: Pannun Case: ఖలిస్తాన్ ఉగ్రవాది పన్నూ హత్య కుట్ర కేసు.. అమెరికాకు అనుకూలంగా చెక్ రిపబ్లిక్ కోర్టు తీర్పు..

కాగా.. ఏపీలో మాజీ నిఘా విభాగాధిపతి, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ్యవహారం ఈ రోజటితో తేలనుంది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో ఆయనపై సస్పెన్షన్ విధించిన వైసీపీ సర్కార్.. అనంతరం హైకోర్టు ఆదేశాలతో ఎత్తేసినా, తిరిగి ప్రెస్ మీట్ పెట్టారన్న కారణంతో మరోసారి సస్పెండ్ చేసింది. దీన్ని తోసిపుచ్చుతూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్ ) తాజాగా ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఏబీకి ఊరట లభించింది. అయితే క్యాట్ ఆదేశాల ప్రకారం ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వాల్సి ఉండగా.. ఏపీ ప్రభుత్వం మాత్రం అందుకు ససేమిరా అంటోంది. అంతే కాదు ఇవాళ క్యాట్ ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించింది. ఏబీపై రెండోసారి సస్పెన్షన్ చెల్లదంటూ క్యాట్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ప్రస్తుతం వాదనలు, ప్రతివాదనలు కొనసాగుతున్నాయి.