NTV Telugu Site icon

Moscow Attack: ఉగ్రదాడిపై పుతిన్ మాస్ వార్నింగ్​.. దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు..!

Russ

Russ

తాజాగా మాస్కోలో జరిగిన దాడికి సంబంధించి రష్యా దేశాధ్యక్షుడు పుతిన్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ దాడికి కారణమైన ఎవరిని కూడా వదిలి పెట్టేది లేదంటూ ఆయన స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన వారికి కఠిన చర్యలు తప్పవని జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఉగ్రదాడలో రక్తపాతం ఏరులైపారింది. అనేకమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. నేడు మార్చి 24 న రష్యా దేశవ్యాప్తంగా సంతాప దినంగా ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Also read: AP BJP: ఏపీ బీజేపీలో కలవరం.. ఇంకా ఫైనల్ కానీ అభ్యర్థుల జాబితా..!

తాజా ఉగ్రదాడి దృష్టి దేశవ్యాప్తంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ దాడులకు సంబంధించి ప్రత్యక్షతంగా కాల్పుల్లో పాల్గొన్న నలుగురితో పాటు., మరో పదకొండు మంది నేరస్తులను భద్రత వలయాలు అదుపులోకి తీసుకున్నాయి. అయితే ఈ పేలులకు ఉక్రయన్ తో సంబంధాలు ఉన్నట్లు సమాచారం అందినట్లు పుతిన్ తెలిపారు. ముఖ్యంగా ఈ దాడికి ఎవరైనా కారుకుల అవ్వచ్చు వారిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేశారు పుతిన్.

Also read: ELECTIONS 2024 : కాంగ్రెస్​ నాలుగో జాబితా రిలీజ్ – మోడీ పై పోటీ చేసేది ఈయనే..!

ఇక ఉక్రెయిన్ తో ముష్కరులకు సంబంధాలు ఉన్నాయని ఈ దాడి జరిగిన తర్వాత ఆ దేశం వైపు వారు వెళ్లేందుకు ప్రయత్నించాలని రష్యా దేశభద్రత అధికారులు తెలిపారు. అయితే ఈ విషయంపై తాజాగా ఉక్రెయిన్ ప్రభుత్వం మాట్లాడుతూ.. తమకేమీ ఇందులో సంబంధం లేదని ఖండించింది. అయితే ఇప్పటివరకు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదు. అయితే ఈ దాడికి కారణం తామే అని ఇస్లామిక్ స్టేట్ ఇదివరకే ప్రకటించింది. ఈ దారుణ ఉగ్ర ఘటనలో 133 కి మృతుల సంఖ్య పెరిగింది.