NTV Telugu Site icon

Snake Bite: పాముతో ఫొటో దిగాలని బలవంతం పెట్టిన మిత్రులు..సర్పం కాటుకు యువకుడి బలి

Snake Bite (2)

Snake Bite (2)

మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఓ యువకుడు తన పుట్టినరోజు నాడు పాము కాటుకు గురై మృతి చెందాడు. ఆ యువకుడు తన పుట్టినరోజు సందర్భంగా స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. ఈ సమయంలో పాముతో ఫొటో దిగాలని మిత్రులు బలవంతం పెట్టారు. దీంతో విషసర్పాన్ని యువకుడు చేతిలో పట్టుకున్నాడు. కాటు వేయడంతో మరణిచాడు. వివరాల ప్రకారం..ఈ ఘటన చిఖాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. చిఖిలీలోని గజానన్ నగర్‌లో నివాసం ఉంటున్న సంతోష్ జగ్దాలే (31) జన్మదిన వేడుకలను మొదటగా కుటుంబ సభ్యులు, బంధువులు సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.

READ MORE: Arvind Krishna: హీరో అరవింద్‌ కృష్ణకు అరుదైన పురస్కారం!

గజానన్ నగర్ నుంచి అతని స్నేహితులు ఇద్దరు వచ్చారు. స్నేహితులిద్దరూ సంతోష్‌ని బయటకు వెళ్లి పుట్టినరోజు జరుపుకోవాలని కోరారు. స్నేహితులిద్దరూ కోరడంతో సంతోష్ వారితో కలిసి బయటకు వెళ్లాడు. పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న సమయంలో.. ఓ మిత్రుడు సంతోష్ ను పాముతో ఫొటో దిగాలని కోరాడు. సంతోష్ చేతిలో విష పామును పెట్టేందుకు ప్రయత్నించాడు. స్నేక్ ఫ్రెండ్ సలహా మేరకు సంతోష్ విషసర్పాన్ని చేతిలోకి తీసుకోగా పాము అతడి చేతికి కాటు వేసింది. దీంతో స్నేహితులిద్దరూ కలిసి అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లగా.. సంతోష్‌ శరీరంలో పాము విషం వ్యాపించడంతో మృతి చెందాడు. ఈ ఘటనతో సంతోష్ కుటుంబంలో విషాదం నెలకొంది. బాధితుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిత్ర స్నేహితులు ఆరిఫ్ ఖాన్, ధీరజ్ పండిట్కర్‌లపై కేసు నమోదు చేశారు.