Site icon NTV Telugu

CID Investigation: సీఐడీ ప్రశ్నల వర్షం.. చంద్రబాబు ఏమన్నారంటే..!

Cid

Cid

CID Investigation: తాడేపల్లి సీఐడీ సిట్ కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. సీఐడీ అడిగే ప్రశ్నలకు చంద్రబాబు సరిగా సమాధానం చెప్పడం లేదని సమాచారం తెలుస్తోంది. ముఖ్యంగా చంద్రబాబును సీఐడీ 20 కఠినమైన ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. చంద్రబాబు విచారణకు సహకరించడం లేదని.. అధికారులు అడిగిన ఏ ప్రశ్నకు ఆయన సరిగా సమాధానం చెప్పడం లేదని సమాచారం అందుతోంది.

Read Also: G20 Summit Live Updates: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో విందు కార్యక్రమం

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అక్రమాలకు సంబంధించిన 20 ప్రశ్నలను CID అధికారులు సంధించారు. స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమాలు, హవాలా లావాదేవీలపై సిట్ అధికారులు ప్రశ్నలు కురిపించారు. అంతేకాకుండా అప్పటి నోట్ ఫైల్ ను సీఐడీ అధికారులు చంద్రబాబుకు చూపించారు. దీంతో తన పాత్రను ఖండించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షెల్ కంపెనీల ప్రతినిధుల మధ్య జరిగిన వాట్సాప్ చాట్ ను సీఐడీ అధికారులు చంద్రబాబుకు చూపించారు. మరోవైపు.. చాటింగ్ గురించి ప్రశ్నించగా తనకు తెలియదని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది.
చాలా ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం.. నాకు తెలియదు, నాకు గుర్తు లేదు అన్నట్లు సమాచారం అందుతోంది.

Read Also: Deepthi Sunaina: ”దీప్తి సునయనకి రోడ్డు ప్రమాదం” ప్రచారం.. అసలు ఏం జరిగిందంటే?

ఇదిలా ఉంటే.. చంద్రబాబును కలిసేందుకు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, తనయుడు నారా లోకేశ్‌తో పాటు నందమూరి రామకృష్ణ, పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, వచ్చారు. చంద్రబాబును కలవడానికి భువనేశ్వరి, లోకేశ్ తదితర కుటుంబ సభ్యులకు అనుమతి ఇచ్చారు. దీంతో వారు సిట్ కార్యాలయంలోకి వెళ్లారు. మరోవైపు నందమూరి బాలకృష్ణ, నారా బ్రాహ్మణి హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరారు.

 

Exit mobile version