Site icon NTV Telugu

Love Tragedy: లవర్ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని గన్‎తో కాల్చుకున్నాడు

Gun Fired

Gun Fired

Love Tragedy: ఇద్దరు జీవితాంతం కలిసి ఉండాలనుకున్నారు. చేతిలో చేయి వేసుకుని బాసలు చేసుకున్నారు. కానీ విధి వారిని వంచించింది.. ఇద్దరిని విడదీసింది. తను ప్రేమించిన యువతికి వేరే వ్యక్తితో పెళ్లి కావడం జీర్ణించుకోలేని 17ఏళ్ల యువకుడు తుపాకీతో కాల్చుకున్నాడు. రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. భిల్వారా జిల్లాలో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. మహాత్మా గాంధీ హాస్పిటల్‌ పరిధిలో ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

Read Also: Revanth Reddy : కేసీఆర్, కేజ్రీవాల్, అసదుద్దీన్ ముగ్గురూ సుపారీ కిల్లర్స్

పోలీసులు అందించిన వివరాల ప్రకారం, వ్యాస్, ఆ అమ్మాయి ఒకే స్కూల్‌లో చదువుకున్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆ బాలుడు సోషల్ మీడియా అకౌంట్‌లో ఓ పోస్టు పెట్టాడు. తన గర్ల్‌ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటున్నదని, దానితో తాను అప్‌సెట్ అయినట్టు ఆ స్టేటస్‌లో పేర్కొన్నాడు. గురువారం రాత్రి మహాత్మా గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో తుపాకీతో తలపై కాల్చుకున్నాడు. అక్కడున్న వారు గమనించి ఆసుపత్రి లోపలకు తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఉదయ్‌పూర్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం అతడు చనిపోయాడు.

Exit mobile version