Site icon NTV Telugu

Youtuber Harassment : యూట్యూబర్ పై ఆకతాయిల వేధింపులు.. వీడియో వైరల్

Harassement

Harassement

Youtuber Harassment : కొరియన్ మహిళా యూట్యూబర్ పై ఇద్దరు వ్యక్తులు వేధింపులకు పాల్పడ్డారు. ముంబైలో లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్న మహిళను వారు వేధించారు. యువకులు ఆమె చేయి పట్టుకుని బైక్ వద్దకు లాక్కెళ్లారు. ఆన్‌లైన్‌లో షేర్ చేసిన వీడియో వైరల్ అయింది. మహిళలను లాక్కెళ్తుండగా ఆమె ‘నో.. నో’ అని అరవడం కనిపించింది. యువకుడు ఆమె చేయి పట్టుకుని లాక్కెళ్లాడు. ఆ తర్వాత ఆమెను ముద్దుపెట్టుకునే ప్రయత్నం చేశాడు. వారు లిఫ్ట్ ఇస్తామని చెబుతూ బైక్ వద్దకు తీసుకెళ్లగా, నిరాకరించిన ఆమె తన ఇల్లు సమీపంలోనే ఉందని వచ్చీరాని ఇంగ్లిష్‌లో చెప్పింది.

Read Also: Bill Clinton : అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కు కరోనా పాజిటివ్

ఈ వీడియోను రీట్వీట్ చేసిన బాధిత యువతి.. ఆ యువకుడితోపాటు మరో వ్యక్తి ఉండడంతో పరిస్థితి మరింత దిగజారకుండా ఉండేందుకు చాలా ప్రయత్నించానని చెప్పింది. గత రాత్రి తాను లైవ్ స్టీమ్‌లో ఉండగా ఈ ఘటన జరిగినట్టు వివరించింది. తాను మరీ అంత స్నేహపూర్వకంగా ఉండడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని కొందరు చెప్పారని, దీంతో స్ట్రీమింగ్ గురించి ఆలోచించాల్సి వస్తోందని వాపోయింది. కాగా, వీడియో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు తమంత తామే కేసు నమోదు చేసి ఆమెను వేధింపులకు గురిచేసిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు.

Exit mobile version